చరణ్ సినిమాలో భారీ రెయిన్ ఫైట్ ... ??

GVK Writings
రామ్ చరణ్ తో ప్రముఖ బడా దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ తమ బ్యానర్ నుండి 50 వ మూవీ గా పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీ యొక్క అధికారిక పూజా సెర్మనీ ఇటీవల ఎంతో వైభవంగా జరుగగా, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేసి యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికని ప్రారంభించారట దర్శకుడు శంకర్. భారీ మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో రామ్ చరణ్ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెంట్ పాత్రలో కనిపించనుండగా ఆయన బృందం లో పని చేసే అమ్మాయిగా కియారా పాత్ర సాగనుందట. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా దర్శకుడు శంకర్ ఈ మూవీ స్క్రిప్ట్ ని ఎంతో పవర్ఫుల్ గా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా పని చేయనున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రధానాకర్షణగా నిలువనుండగా సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక భారీ రెయిన్ ఫైట్ అయితే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిచడం ఖాయం అని సమాచారం. ఆ విధంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మంచి అకేషన్ చూసుకుని రిలీజ్ చేసేలా దర్శక నిర్మాతలు ఇప్పటినుండే ప్రణాళికలు రచిస్తున్నారట. మరి ఫస్ట్ టైం శంకర్ తో కలిసి రామ్ చరణ్ చేస్తున్న ఈ భారీ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని నెలల వరకు ఓపిక పట్టాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: