పర్లేదు కుర్రోడు బాగానే చేసినట్లున్నాడు .... ??

GVK Writings
విలక్షణ నటుడు శ్రీకాంత్ హీరోగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్ గా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పెళ్లి సందడి. కొన్నేళ్ల క్రితం మంచి అంచనాలతో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తరువాత హీరోగా శ్రీకాంత్ కి భారీ క్రేజ్ దక్కింది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమా ని ఎంతో అద్భుతంగా తెరకేకించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.
అయితే మళ్ళి కొన్నేళ్ల తరువాత శ్రీకాంత్ పెద్ద తనయుడు రోషన్ హీరోగా ప్రస్తుతం అదే సినిమాని పెళ్లిసందడి పేరుతో రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించారు. రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా ఈ మూవీ ద్వారా తొలిసారిగా వెండితెరపై నటుడిగా దర్శనం ఇవ్వనున్నారు రాఘవేంద్ర రావు. పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమా థియేట్రీకల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించారు. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే నాటి పెళ్లి సందడి మాదిరిగా ఇంటిల్లిపాదినీ అలరించే విధంగా ఈ పెళ్లి సందడి కూడా తెరకెక్కినట్లు కొంతవరకు మనకు అర్ధం అవుతుంది.
రోషన్ పలికే డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ వంటివి ట్రైలర్ లో ఎంతో బాగుండడంతో పాటు హీరోయిన్ శ్రీలేల సన్నివేశాలు, బీజీఎమ్, విజువల్స్ వంటివి ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ కి ప్రస్తుతం ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుండడంతో పాటు ట్రైలర్ ని బట్టి చూస్తే కుర్రోడు బాగానే చేసినట్లున్నాడు అంటూ హీరో రోషన్ ని ఉద్దేశించి పలువురు ప్రేక్షకాభిమానులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి శ్రీకాంత్ తనయుడు ఈ ఫస్ట్ మూవీ తో ఎంత మేర సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: