"7/G బృందావన్ కాలనీ" హీరోయిన్ విడాకులకు కారణమిదేనా ?

VAMSI
"7/G బృందావన్ కాలనీ" మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకున్న హీరోయిన్ సోనియా అగర్వాల్. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ అలియాస్ శ్రీ రాఘవ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. యువతలో జోరు హోరెత్తించిన ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకుంది సోనియా. ఆ తరువాత కొన్ని తమిళ చిత్రాల్లో నటించి మెల్లగా కనుమరుగైపోయింది. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడే "7/G బృందావన్ కాలనీ" డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విడాకులు అంటూ వివాదాల్లో కొద్ది రోజులు సతమతమయ్యింది. మళ్లీ అవకాశాలు కోసం చాలా ప్రయత్నించింది కానీ ఫలితం మాత్రం దక్కలేదు. అడపాదడపా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నారు.
కొద్ది కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ "టెంపర్" చిత్రంలో డాక్టర్ పాత్రలో మెరిసింది. అయితే ఈ అమ్మడు వివాహం టక్ అని జరిగిపోవడం, విడాకులు విషయాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇపుడు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. పంజాబీ అమ్మాయి సోనియా అగర్వాల్ "నీ ప్రేమకై"  చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అనంతరం ఇటు తెలుగు, అటు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్ గా కెరియర్ లో జోష్ పెంచింది.  అనంతరం 7/G బృందావన్ కాలనీ షూటింగ్ టైం లో ఆ సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో పరిచయం ప్రేమగా మారి ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈయన తమిళ సీనియర్ దర్శకుడు కస్తూరి రాజ పెద్ద కొడుకు. తమిళ స్టార్ హీరో ధనుష్ సెల్వ రాఘవన్ కి సొంత తమ్ముడు.
ఈయన తెలుగులోనూ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, 7/G బృందావన్ కాలనీ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే సెల్వ రాఘవన్ ను 2006 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది సోనియా అగర్వాల్. అలా కొన్నాళ్ళు గడిచాక వీరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. 2010 లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరి విడాకులు తీసుకోవడానికి కారణం ఇవేనంటూ పలు రూమర్లు వినిపించాయి. కానీ దేనికీ సరైన ఆధారం లేదు. పెళ్లి తర్వాత కెమెరాకు దూరమైన సోనియా. మళ్ళీ విడాకులు తీసుకున్న తర్వాత దక్షిణాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. సెల్వ రాఘవన్ 2011 లో గీతాంజలి రామన్ ను రెండో వివాహం చేసుకోగా సోనియా మాత్రం దాదాపు పదేళ్లుగా సోలో లైఫ్ నే ఎంజాయ్ చేస్తూ కెరియర్ పైనే దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: