బింబి సారుడు కూడా ఆగట్లేదు గా!!

P.Nishanth Kumar
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసారా చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  కళ్యాణ్ రామ్ కెరియర్ లో 18వ సినిమా గా రాబోతున్న ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా ఎప్పటినుంచో కళ్యాణ్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసి హిట్ ను సొంతం చేసుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చివరి దశకు తీసుకువచ్చారు. డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్లో ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుండటం తో దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. రెండవ భాగాన్ని కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా నే విడుదల చేయాలని అనుకుంటున్నారు. రెండు నెలల గ్యాప్ మాత్రం తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హై బడ్జెట్ సినిమా గా తెరకెక్కుతుంది. మల్లిడి వశిష్ఠ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా కళ్యాణ్ రామ్ కి జంటగా క్యాథరిన్ తెరిసా మరియు సంయుక్త లు నటిస్తున్నారు. 

ఇక ఈ సినిమాతో పాటే కళ్యాణ్ రావన్ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆయన 118 సినిమా ఓ మోస్తరు హిట్ అండుకోగా అంతకుముందు పటాస్ తప్ప ఆయన కెరీర్లో పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేవీ లేవు. ఇప్పుడు చేస్తున్న ఈ రెండు విభిన్నమైన చిత్రాలతో అయినా ఆయన హిట్ ట్రాక్ ఎక్కుతాడా అనేది చూడాలి. ఏదేమైనా తన మార్కెట్ గురించి బడ్జెట్లతో సినిమాలు చూస్తూ కళ్యాణ్ రామ్ పెద్ద రిస్క్ లే చేస్తున్నాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: