అన్నాత్తే దర్శకుడికి మరి ఆఫర్ ఇవ్వనున్న రజని...!

murali krishna
ఇష్టమైన దర్శకులను తిరిగి మళ్ళీ కంటిన్యూ చేయడంలో సూపర్‌ స్టార్‌ రజనికాంత్‌ ఎప్పుడూ ముందుంటాడని అందరికి తెలుసు. మేకింగ్ కూడా నచ్చితే ఇక డేట్స్ ఫుల్ గా ఇచ్చేస్తాడని సమాచారం.ప్రస్తుత కాలంలో పారంజిత్ తో వరుసగా రెండు చిత్రాలు చేసాడని సమాచారం.

ఇప్పుడు అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారట రజనికాంత్. అన్నాత్తే దర్శకుడికే మరో అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం.

రజనీ హీరోగా నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ పూర్తైందని తెలుస్తుంది. దీపావళికి ఘనంగా విడుదలకు ముస్తాబవుతోందని సమాచారం. ఈ సినిమా పూర్తైన తర్వాత రజనీకాంత్ నటించే కొత్త చిత్రంపై కోలీవుడ్ లో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తుంది.ఒకసారి పెరియా స్వామి అనే యంగ్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని మరోసారి సొంత అల్లుడు ధనుష్ కు అవకాశం ఇవనున్నారని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయని సమాచారం.కాని రజనీ ఆలోచన వేరుగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అన్నాత్తేను డైరెక్ట్ చేసిన శివను మరోసారి తనని డైరెక్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని సమాచారం.
 

అన్నాత్తే దర్శకుడు అంటే ఎవరో కాదు.. తెలుగులో శౌర్యం మరియు శంఖం అలాగే దరువు చిత్రాలను తెరకెక్కించన దర్శకుడు శివ.2014లో కోలీవుడ్ వెళ్లి అక్కడ అజిత్ కు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించాడని అందరికి తెలుసు. దాంతో స్టార్ డైరెక్టర్ గా మారాడని సమాచారం.ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడని తెలుస్తుంది..అందుకే ఈ దర్శకుడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట సూపర్ స్టార్ రజని . స్టోరీ రెడీ చేస్తే డేట్స్ ఇస్తానని మాట ఇచ్చాడని సమాచారం.మరోవైపు శివ దర్శకత్వంలో నటించేందుకు సూర్య చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడని తెలుస్తుంది. అన్నాత్తేకు ముందు సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమా సూర్యదేనటా . కాని రజనీకాంత్ కోసం డెట్స్ అడ్జెస్ట్ చేసుకున్నాదట సూర్య.ఇప్పుడు తలైవా మరోసారి శివ డేట్స్ ను బ్లాక్ చేయబోతున్నారని సమాచారం. మరి సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అందరిలో ఆసక్తి కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: