మ‌రో ఆర్జీవీ చిరు ఎందుకు స‌ర్ అలా చేశారు?

RATNA KISHORE
ఎన్నో క‌ల‌లు క‌లిసి చిరు అనే మెగాస్టార్ ను త‌యారు చేశాయి..ఎన్నో ఆశ‌లు క‌లిపి ఒక చోట చేరి ఒక తార‌కు కొత్త వెలుగు అందిం చాయి.. ఆశారేఖ‌లు ఇవి అని అనాలి. చిరు..మాస్ కు డెఫినిష‌న్ ఇచ్చారు. ఓ మాస్ హీరో ఏం చేయాలో అదే చేసి చూపారు. ఎంద రినో చూశాక ఒక హీరో వ‌స్తాడు..కానీ ఒక హీరో ను చూశాక, వాడ్ని ప్రేమించాక ఇంకెంద‌రో స్టార్ లు వ‌చ్చారు. స్టార్ డ‌మ్ ను పోగేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ చిరు ఎన్న‌టికీ చిరూనే! తార‌ల ఎంపిక ప్రేక్ష‌కుల ఇష్టం.. తార‌ల‌ను ప్రేమించడం వారి ఎంపిక‌లో ఉండే ప్రాధాన్యానికి సంబంధించి అంశం. కానీ చిరు తార‌ల‌కే తార.. అవును! హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ ద మాస్..

ఇంకెప్పుడూ ఇలా అన‌కు చిరు.. మీరు మీ స్థాయిలోనే ఉండాలి. ఉంటేనే నా లాంటి వాడికి న‌చ్చుతారు.  సాయి ప‌ల్ల‌వి లాంటి చి న్న పిల్ల‌ల‌ను చూసి మీరు అసూయ చెంద‌కూడదు అండి. ఆమె మీతో న‌టించ‌కున్నా మీకేం న‌ష్టం ఉండ‌దు..కానీ ఇలాంటి మాట లే కాస్త మీ స్థాయినో హోదానో హుందాత‌నాన్నో త‌గ్గిస్తాయి స‌ర్... ఒక్క సారి ఆలోచించండి. ఆమె పింపుల్ పిల్ల.. మీరు డింపుల్ స్టార్ హా! హా! హా !కాదంటారా? ఏమో! మ‌రి! ఆ క‌ళ్లేంట్రా అలా ఉన్నాయి అని మిమ్మ‌ల్ని ఉద్దేశించి సావిత్రి గారు అన్న మాట‌లు తలుచుకోండి చిరూ! ఆనందిస్తారు..ఆ..ఆనందం వెనుక ఇన్నేళ్ల క‌ష్టాన్నీ మ‌రొక్క‌సారి మ‌రిచిపోతారు.


కోట్ల ప్ర‌జ‌లు ఆరాధించే హీరో మెగాస్టార్ చిరంజీవి. నాలాంటి వారికి ఎంతో స్ఫూర్తి. గెలుపు శిఖ‌రం. నేను ఆ శిఖ‌రం చెంతే ఉంటాను  స‌ర్..మీరు ఏంటి ఇలా.. ఓ చిన్న ఆర్టిస్టును చూసి పొంగిపోతూ మీ ప‌క్క‌న నేను నటించాలి అనుమ‌తి ఇస్తారా అని అంటారా?దే వుడా ! ఇవి మీకు త‌గునా! బాస్ ఏంటి మాట‌లు ? సాయి ప‌ల్ల‌వి అనే అమ్మాయి నిన్న కాక మొన్న వచ్చారు. ఆమె కెరియ‌ర్ ఏం టి మీ కెరియ‌ర్ ఏంటి స‌ర్ ? అస్స‌లు పోలిక ఉందా చెప్పండి. మీరు మీలానే ఉండాలి. మీరు మ‌రో శిఖ‌రాన్ని త‌యారు చేయాలి.

మ‌రో కొత్త తార‌ల అన్వేష‌ణ‌కు స‌హ‌క‌రించాలి. అదేంటి స‌ర్! మీరు ఆర్జీవీలా మాట్లాడుతున్నారు. ఆయ‌న లా మీరు ఉండకండి ప్లీజ్ ..ఆయ‌న‌వన్నీ చిల్లర వేషాలు. వాటి వ‌ల్ల నో యూజ్ ..మీరు మా మెగాస్టార్.. మీ స్థాయిని నేను చేరుకోవాలి అని అనుకుంటాను. అది క‌దా కావాలి. పాండి బ‌జారులో న‌డిచే చిరంజీవి నాకెంతో ఇష్టం స‌ర్.. మీరు త‌మ్ముళ్ల‌ను ప్రేమిస్తారు చూడండి అప్పుడు ఇంకా ఇష్టం స‌ర్.. అల్లుళ్ల‌కు క‌ష్టం వ‌స్తే వ‌ణికి పోతారు చూడండి అప్పుడు ఇష్టం స‌ర్..ఇదేంటి మ‌రీ!ఇలా! మీ ప‌క్క‌న ఆమె నటించేందు కు ఉవ్విళ్లూరాలి..ఉత్సాహం ఉర‌కలెత్తాలి..అంతేకానీ! లూసీఫ‌ర్  రీమేక్ లో న‌టించ‌ను అని చెప్పార‌ని స‌భా ముఖంగా ఎలా అంటా రు ఆ విధంగా.. మీ ప‌క్క‌న న‌టించేందుకు కొన్ని కొత్త తార‌లు కూడా అందాల‌ను పోగేసుకుని ఉన్నాయండి..వాటినీ ఓ సారి ప‌ల క‌రించండి.
చిరు స‌ర్! ఇది మీకు త‌గ‌దు. నేను మీ అభిమానిని. ఇలాంటి ప‌నులు చేస్తే బాధ‌ప‌డతాం మాలాంటి వారంతా! అస‌లు మీకెందుకు ఈ రీమేకుల పిచ్చి. ఎంచ‌క్కా నేరు క‌థ‌లే చేయండి.. మీ సినిమాల‌కూ,  ప‌వ‌న్ సినిమాల‌కూ క‌థ‌లు కొర‌తా ఎందుకు? మీరు మీ కు తెలిసిన ఫార్ములా క‌థ‌లోతోనే రండి ఏం కాదు.. విజ‌యేంద్ర ప్రసాద్ అనే రైట‌ర్ ఓ మాట అన్నాడు. ప‌వ‌న్ సినిమాల‌కు క‌థ రా య‌న‌వ‌స‌రం లేద‌ని..అది నిజంగానే నిజం..బాస్! మీ ఈజ్ ఎక్క‌డికీ పోలేదు. మీ డ్యాన్స్ మీ జోష్ ఎక్క‌డికీ పోదు..పోలేదు కూ డా! మీరు శిఖ‌రం అలానే ఉండాలి. ప‌క్క‌కు ఒరిగిపోకూడ‌దు ఎన్న‌టికీ... గుర్తుంచుకోవాలి మీరు.....మిస్ట‌ర్ చిరూ ఆల్ ద బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: