నయన్... ఇక సినిమాలు చేయదా... ?

Satya
నయన తార. అందాల తార. యువత మదిలో మందార మాల. ఈ అమ్మడు నాటౌట్ అంటూ దాదాపుగా రెండు దశాబ్దాలుగా దూసుకుపోతోంది. కోలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. సౌంతిండియా క్వీన్ గా మెరుస్తూ సూపర్ స్టార్ డమ్ ని కూడా ఎంజాయ్ చేస్తోంది.
ఇక నయన్ చంద్రముఖి మూవీ తెలుగులో కూడా బంపర్ హిట్ అయింది. ఆ తరువాత వెంకీతో చేసిన లక్ష్మి మూవీ మరో  బ్లాక్ బస్టర్ అయింది. బాలయ్యతో చేసిన సింహా సూపర్ డూపర్ హిట్. ఇలా నయన్ తెలుగులో చేసిన సినిమాలు అన్నీ కూడా అప్పట్లో హిట్ బాజా మోగించాయి. అయితే నయన్ మాత్రం తెలుగు అంటే ఎందుకో దూరంగానే ఉంటోంది. ఎంతసేపూ ఆమె కోలీవుడ్ కే ప్రయారిటీ ఇస్తోంది. ఇక ఆమె రెమ్యునరేషన్ కూడా సౌతిండియాలో హీరోయిన్లందరి కంటే చాలా ఎక్కువ. ఆరు కోట్ల దాకా ఆమె తీసుకుంటోంది అని చెబుతారు.
సరే నయన్ ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో సైరా మూవీ చేసింది. ఆ మూవీ బాగానే ఆడింది. మళ్లీ చిరుతో ఆమె కాంబో అన్నారు కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ఇక బాలయ్య అయితే  తన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి కోసమే నయన్ తో నటించాలని అనుకున్నారు.  ఆ మధ్యలో జై సింహాలో ఆమె చేసింది. అంతే ఆ తరువాత ఆమె చేయలేదు. అలాగే సీనియర్ హీరోలు అందరూ కూడా నయన్ తో చేయడానికి రెడీ అంటున్నారు. కానీ నయన్ మాత్రం టాలీవుడ్ కి కాల్షీట్లు ఇవ్వడానికి ఎందుకో ఆలోచిస్తోంది అంటున్నారు. మొత్తానికి నయన్ తెలుగులో ఇక మీదట సినిమాలు చేయదా అన్న డౌట్ అయితే అందరికీ వచ్చేస్తోంది. మరి ఆమె కనుక ఎస్ అంటే మాత్రం అర డజన్ కి పైగా మూవీస్ చేతిలో ఉంటాయనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: