సోషల్ మీడియాలో పవన్ కూడా ... .కానీ .... ??

GVK Writings
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల క్రితం వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. అంతకముందు మూడేళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు అటు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ రెండు సినిమాల్లో నటిస్తుండగా మరొక రెండు మూవీస్ త్వరలో పట్టాలెక్కనున్నాయి. ముందుగా రానా తో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్ ప్రస్తుతం వేగవంతంగా షూటిం జరుపుకుంటోంది.
అలానే క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కొంత భాగం షూటింగ్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ ని త్వరలో ప్రారంభించనున్నట్లు టాక్. అయితే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి తన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల తో కూడా టచ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు జరిగే సామజిక ఘటనలు, అలానే రాజకీయ అంశాలకు సంబంధించి ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ లు పెట్టె పవన్ కళ్యాణ్, తరచు వాటిపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఇక ఈ మీడియా మాధ్యమాల వినియోగం ద్వారా తన మనసులోని భావాలూ అందరికీ వ్యక్త పరచడంతో పాటు ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉండవచ్చని అంటారు పవన్.
అయితే ఆయన తన సోషల్ అకౌంట్స్ పోస్ట్ లు పెడుతుంటారు తప్ప మిగతా నటీనటుల మాదిరిగానే ప్రేక్షకాభిమానుల ప్రశ్నలకు ఎక్కువగా రిప్లై లు ఇవ్వడానికి ఇష్టపడరు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పవన్ నుండి వరుసగా సినిమాలు రానుండడంతో పాటు ఆయన మరొకవైపు తన జనసేన పార్టీ తరపున కూడా మరింత యాక్టివ్ గా కొనసాగుతుండడంతో తమ హీరో త్వరలో అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా దూసుకెళ్లడం ఖాయాం పలువురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిలషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: