ఆ కారణం వల్లే రవితేజకు విక్రమార్కుడు సీక్వెల్ పై అంత ఇంట్రెస్ట్ చూపడం లేదా..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కి 23 జూన్ 2006 న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'విక్రమార్కుడు'. ఈ సినిమాకు కథను దర్శకధీరుడు రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ అందించాడు. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ లో నవ్వులు పూయిస్తూ , విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి జనాలను మెప్పించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇలా దర్శక ధీరుడు రాజమౌళికి, మాస్ మహారాజా రవితేజ కి ఎంతో గుర్తుండిపోయే సినిమాల మిగిలిన 'విక్రమార్కుడు' సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కించేందుకు కథను విజయేంద్రప్రసాద్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'విక్రమార్కుడు' సినిమా సూపర్ హిట్ కావడం మరియు ఆ కథను రాసిన విజయేంద్రప్రసాద్ ఈ కథను కూడా రాయడంతో నిర్మాతలు ఈ కథ కోసం పోటీ పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాను ఈ సారి రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలా 'విక్రమార్కుడు' సీక్వెల్ పై రోజు రోజుకు అనేక కథనాలు బయటకు వస్తుంటే, ప్రస్తుతం మరో వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటంటే.. అసలు 'విక్రమార్కుడు' సీక్వెల్ నటించడానికి రవితేజ కి ఇంట్రెస్ట్ లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఇప్పటికే రవితేజ 'కిక్' సూపర్ హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ గా 'కిక్ టు' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. దానితో రవితేజ కు సీక్వెల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది అని, అందుకే 'విక్రమార్కుడు' సినిమా సీక్వెల్ మీద రవితేజకు అంతగా ఇంట్రెస్ట్ లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: