ఏఎన్ఆర్ కి వచ్చిన అవార్డ్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

NIKHIL VINAY
తెలుగు తెరకు దక్కిన అద్భుతమైన నటులలో ఏఎన్ఆర్ ఒకరు. ఆయన చేసిన ఏ పాత్ర అయిన కూడా అందులో పరకాయ ప్రవేశం చేసే గుణం ఏఎన్ఆర్ కి సొంతం. ఇక ఏఎన్నర్ గారి సినీ జీవితంలో ఎన్నో బిరుదులు ఇంకెన్నో అవార్డులు అందుకున్నారు. ఆయనకి కేంద్ర ప్రభుత్వం 1991లో చిత్ర రంగానికి సంబంధించి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు.ఇదే కాకుండా దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్‌’ తో ప్రభుత్వం ఆయన్ని గౌరవించడం విశేషం.

 ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ లాంటి మూడు పద్మ పురస్కారాలు తెలుగు చిత్రసీమా లిప్ పొందిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే. ఇండియాలో మొదటి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న నటుడు కూడా అక్కేనేని నాగేశ్వరరావు గారు . ఇక అక్కినేని గారికి వచ్చిన భిరుదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ని 'నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు' అని తెలుగు ప్రజలు పిలుస్తారు. ఆ బిరుదును 1957 లో ఒకప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారి చేతులు మీదగా అందుకున్నారు.  ఆయనకి ఇవే కాకుండా 'నట సార్వభౌమ', 'నట రాజశేఖర', 'కళాప్రవీణ', 'అభినయ నవరస సుధాకర',వంటి చాలా బిరుదులు ఉన్నాయి.

అలాగే  నాగేశ్వరరావు గారికి మూడుసార్లు గౌరవ డాక్టరేట్‌ ని ప్రఖ్యాత యూనివర్సిటీలు ఇచ్చాయి.2010 లో సుబ్బిరామిరెడ్డి మిలినియం అవార్డ్ తో అక్కినేని గారిని సత్కరించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అక్కినేని గారికి ఇచ్చి ఆయన్ని గౌరవించారు. ఆయన నటించిన మేఘ సందేశం , 'బంగారు కుటుంబం'  చిత్రాల్లో ప్రదర్శించిన నటనకు గాను అక్కినేని నాగేశ్వరరావు గారు  రెండు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు .అలాగే 'మరపురాని మనిషి' , 'సీతారామయ్యగారి మనవరాలు' , 'బంగారు కుటుంబం' చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఆయన్ని వరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR

సంబంధిత వార్తలు: