జబర్దస్త్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆ ముగ్గురు..!

Pulgam Srinivas
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ 'షో' లలో ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ఒకటి. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా మంచి  టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతోంది. ఈ 'షో' ను మొదట తెలుగులో మంచి గుర్తింపు పొందిన కొంత మంది కమెడియన్లతో ప్రారంభించారు. ఆ తర్వాత వారికి సినిమా అవకాశాలు రావడంతో వారు బయటికి వెళ్లారు. వారి స్థానంలో మరికొంతమందిని జబర్దస్త్ టీం సెలెక్ట్ చేసి వారితో పర్ఫామెన్స్ లు చేయించింది. వారిలో కొంతమంది తమ పర్ఫామెన్స్ తో జనాలను ఆకట్టుకొని  జబర్దస్త్ లో పర్మినెంట్ టీం లీడర్ లుగా మారడం మాత్రమే కాకుండా, సినిమా అవకాశాలను కూడా సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో చంద్ర, వేణు, ధనరాజ్ ల గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

 కానీ ఆ తర్వాత మీరు వేరే ఛానల్ కామెడీ 'షో' లకు వెళ్ళిపోయారు. కానీ జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుండి వేణు వండర్స్ టీం లో ఉన్న సుడిగాలి సుధీర్, గెటప్ శీను జబర్దస్త్ 'షో' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో కనిపించే జనాలను అలరించారు. వీరితో పాటే అదిరే అభి టీం లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత తన టాలెంట్ తో టీం లీడర్ గా ఎదిగి, ప్రస్తుతం జబర్దస్త్ లో ఫుల్ కామెడీని పండిస్తూ ముందుకు దూసుకుపోతున్న టీం లీడర్ లలో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది అదిరిపోయే పంచ్ లతో జబర్దస్త్ లో మంచి పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా జబర్దస్త్ షో లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్, గెటప్ శీను, హైపర్ ఆది జబర్దస్త్ లో ఉన్న అందరి కంటెస్టెంట్ ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: