సుమంత్ అంటే ఎందుకు ఎఎన్ఆర్ కు అంత ప్రేమ... ?

VAMSI
సినీ రంగంలో నటుడిగా బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరావు ప్రయాణం ఎంతో కీలకం. హీరోలు కూడా పాటలకు స్టెప్పులు వేయాలన్న ఆలోచన ఈయనతోనే మొదలైందట. అలా వెండి తెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఎ ఎన్ ఆర్. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ తో పాటు మూల స్తంభంగా కీర్తి గడించారు. చిన్న వయసులో సినీ పరిశ్రమకు వచ్చి ప్రతి సినిమాని ఓ మెట్టుగా మలుచుకుని ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరుకున్నారు ఎ ఎన్ ఆర్. ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ఒకటి...అక్కినేని నాగేశ్వరావుకు మనవడు సుమంత్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అని అందరికీ తెలిసిందే. అయితే ఆయన సుమంత్ ని మనవడిగా కాదు కొడుకులా తన చేతుల మీదుగా పెంచారు.
అప్పట్లో ఆయన చాలా బిజీగా ఉండటంతో కనీసం తన కన్న బిడ్డలకు కూడా అలా దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోలేదట. ఆయన పిల్లలపై ఉన్న అచ్చట ముచ్చట అన్ని సుమంత్ ని పెంచుతూ ఆ ఆనందాన్ని అనుభూతి చెందారట అక్కినేని నాగేశ్వరరావు. సుమంత్ తన తల్లితండ్రుల దగ్గర కంటే కూడా తాతగారి వద్దే ఎక్కువగా పెరిగాడు. నాగేశ్వరరావు కు ఎంతో ఇష్టమైన గారాల మనవడిగా ప్రేమనే కాదు ఆస్తిని కూడా పంచుకున్నారట సుమంత్. ఈ మాట స్వయంగా నాగేశ్వరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అప్పుడు ఏమన్నారంటే అప్పట్లో ఆయన కుమార్తె నాగ సుశీల తొలి కాన్పుకు ఇండియా వచ్చినప్పుడు సుమంత్ జన్మించాడని, అతడిని నా దగ్గరే వదిలి వేళ్ళు, నేనే పెంచుకుంటాను, మీకు కావాలంటే ఇంకొకర్ని కనండి అని, అలా సుమంత్ ను తను పెంచిన వారసుడిగా ఓ ఇల్లును కూడా రాసి ఇచ్చినట్లు తెలిపారు.
అంతేకాదు ఆస్తిలో కూడా కొడుకులతో పాటుగా సుమంత్ కి కూడా కొంత ఆస్తిని ఎ ఎన్ ఆర్ రాసిచ్చినట్లు సమాచారం. అలా అక్కినేని నాగేశ్వర రావుకు మనవడు సుమంత్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అలాగే సుమంత్ కూడా చాలా సార్లు తాతగారు నన్ను తండ్రిలా ప్రేమను పంచి అండగా నిలిచారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR

సంబంధిత వార్తలు: