సినిమానే శ్వాసగా బ్రతికిన మహా నటుడు...

VAMSI
సినిమా అంటే నాగేశ్వర రావు...నాగేశ్వర రావు అంటే సినిమా అన్నట్టుగా జీవించారు ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వర రావు. నటన అంటే ఆయనకు ప్రాణం. తెలుగు సినీ రంగంలో నంది అవార్డులను ప్రవేశపెట్టినప్పుడు తొలి బంగారు నంది అవార్డును సొంతం చేసుకున్న ఘనత ఆయనకే దక్కింది. ఆయన నటించిన డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఇది దక్కడం ప్రశంసనీయం. "ధర్మపత్ని" చిత్రంతో మొదలైన ఈయన సినీ ప్రయాణం "మనం" సినిమాతో ముగిసింది. ఆయన ఈ లోకంలో మన మధ్య లేకపోయినా గొప్ప నటుడిగా మన గుండెల్లో మాత్రం చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోయారు. అయన 91 సంవత్సరాల జీవిత ప్రయాణంలో 75 సంవత్సరాలు సినీ రంగంలో కథానాయకుడిగా, నిర్మాతగా, ప్రత్యేక నటుడిగా రాణించారు. మరణించే చివరి క్షణం వరకు కూడా సినిమాలో నటించడం నిజంగా చాలా గొప్ప విషయం.
అందులోనూ ఆ వయసులో కూడా అంతే సహజ నటనను ప్రదర్శించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఆ ఘనత ఒక్క నాగేశ్వర రావుకి మాత్రమే సొంతం. ఇక ఆయన కెరియర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో సూపర్ హిట్లు ఇంకెన్నో బ్లాక్ బాస్టర్లు. అయితే ఆయన చివరి సినిమా "మనం" మాత్రం ఆయనే కెరియర్ లోనే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒక నటుడు వీలైతే తన కొడుకుతో లేక ఎవరో ఒక కుటుంబ సభ్యులతోనో కలసి నటించడం చూసాం. కానీ అక్కినేని నాగేశ్వరావు మాత్రం తన కుటుంబం మొత్తంతో కలసి స్క్రీన్ ను షేర్ చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. తన ఫ్యామిలీతో కలిసి నటించి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.
కానీ ఈ సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమే అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా చాలా స్పెషల్ అధ్బుతమైన కుటుంబ కదా చిత్రంగా, సరికొత్త కథనంతో బ్లాక్ బాస్టర్ ను అందుకుంది.  టాలీవుడ్ లో ఇదో సంచలనం. కథ వినడానికి ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుందో....స్క్రీన్ పై అంతకు మించి క్లారిటీ కనబరిచి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు దర్శకుడు విక్రమ్. గతంలో అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలు రాగా ఇది వీరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం. నాగేశ్వర రావు తన చివరి వరకు సినిమానే శ్వాసగా బ్రతికాడు. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరావు స్థాపించిన సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకోవడం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR

సంబంధిత వార్తలు: