'ఇండియన్ టు' కు మరో కష్టం తెచ్చిపెట్టిన కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
ఒక సినిమా ఆగిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాల సంఖ్య పెరుగుతూ పోతుంటే ఆ సినిమా ఎప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకుంటుంది, థియేటర్లలోకి వస్తుందా రాదా అనే ప్రశ్నలు అధికమై సినిమాపై ఉన్న ఆసక్తి కూడా రోజురోజుకు తగ్గిపోతూ ఉంటుంది .ఇలా షూటింగ్ ప్రారంభించినప్పుడు ఎన్నో అంచనాలతో ప్రారంభమై ఆ తర్వాత అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సినిమాలలో 'భారతీయుడు టు' ఒకటి. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి 1996 వ సంవత్సరం విడుదలైన 'భారతీయుడు' సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి సినిమాగా పేరు తెచ్చుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచి హీరోగా కమల్ హాసన్ కు దర్శకుడిగా శంకర్ కు ఎనలేని పేరును తీసుకువచ్చింది.

అయితే మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడం కోసం దర్శకుడు శంకర్, కమల్ హాసన్ తో కలిసి 'భారతీయుడు టు' సినిమా ప్రారంభం చేశాడు. సినిమాను కావలసినంత గ్రాండ్ గా తీయడానికి లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. అలా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా కొంత కాలానికే సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగడం, ఆ తర్వాత దర్శక , నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎంత కాలానికి షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇలా ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యింది. దానితో కమల్ హాసన్ కూడా తన సొంత బ్యానర్ లో 'విక్రమ్' అనే సినిమా లో నటిస్తూ బిజీ అయిపోయాడు. ఈ నేపధ్యంలో 'ఇండియన్ టు' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ కు ప్రెగ్నెన్సీ అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. దీనితో ఒక సంవత్సరం పాటు కాజల్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఆ తర్వాత అయిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుందా లేదా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యి , సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియకుండా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: