బిగ్ బాస్ లో రామ్ చరణ్ వేసుకున్న జాకెట్ ధర ఎంతో తెలుసా..?

Divya
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు వెర్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ఈ విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి.. అయితే నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కు సంబంధించిన ఈ విషయాన్ని నాగ్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.. అంటే ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను ప్రమోట్ చేసే బాధ్యత రామ్ చరణ్ కి ఉంది అంటూ ఆయన సగౌరవంగా తెలియజేయడంతో.. ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.. ఇకపోతే బిగ్ బాస్ షో కి రామ్ చరణ్ తో పాటు యంగ్ హీరో నితిన్, మిల్క్ బ్యూటీ తమన్నా , యంగ్ హీరోయిన్ నటా నభేష్ కూడా హాజరయ్యారు..
ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ ను  నాగార్జున ఎంతో ఆప్యాయంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి ఆహ్వానించడం జరిగింది.. రామ్ చరణ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరితో మాట్లాడి వారిని ఖుషి చేశారు.. రామ్ చరణ్ వేసుకొచ్చిన డ్రెస్ పై ఇటీవల వార్తలు వైరల్ గా మారాయి.. ఈయన బ్లాక్ టీ షర్ట్, డెనిమ్  జీన్స్  తో పాటు షర్ట్ పై డెనిమ్ జీన్ కోట్ తో షో కి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు..
ఫ్యాషన్ బ్రాండ్ డస్ట్ ఆఫ్ గాడ్ రూపొందించిన జోకన్ డెనిమ్ ధర అక్షరాల 1.3 లక్షల రూపాయలట. చరణ్ ఈ  ఈవెంట్ కోసం చాలా ప్రత్యేకంగా రెడీ అయ్యారు.ఇకపోతే రామ్ చరణ్ ఎప్పుడూ  ఖరీదైన వస్త్రాల్లో కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కేవలం  సింపుల్ గా ఉండే దుస్తుల్లోనే ,తనలో రిచ్ నెస్ చూపిస్తుంటారు. కానీ నిన్నటి రోజున ఒక ట్రెండీ ఫ్యాషన్ బుల్ పర్సన్ గాను కనిపించి, అభిమానులను  ఖుషీ చేసారు.  బిగ్ స్టార్స్ ని కలుసుకునే వేదికగా బిగ్ బాస్ నిలిచిందని వారు సంతోషం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: