టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్ చెప్పింది. సమంత నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల్ రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా నుండి టు టూ టు టూ అనే పాటను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఫిదా అయ్యింది. తన సోషల్ మీడియాలో పాటను షేర్ చేసిన ప్రియాంక చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించింది.
అంతే కాకుండా విగ్నేష్ శివన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతూ ప్రియాంక చోప్రా పోస్టు పెట్టడంతో సమంత కూడా స్పందించింది. మీ మాటలు మా మూవీ టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయంటూ ప్రియాంక చోప్రాకి సామ్ థ్యాంక్స్ చెప్పింది. ఇదిలా ఉండగా విఘ్నేష్ శివన్ నయన తార మరియు లలిత్ కుమార్ సంయుక్తంగా ‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని విఘ్నేష్ వివన్ నయనతార ఫుల్ కుషీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తన వైవాహిక జీవితంలో ఒడిదొడుకుల కారణంగా సమంత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే సామ్ చై విడాకుల కోసం కోర్టను ఆశ్రయించారని ఏ సమయంలో అయినా తాము విడిపోతున్నామని ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇవే ప్రశ్నలు అటు సమంతకు ఇటు నాగ చైతన్యకు సోషల్ మీడియాలో ఎదురవుతున్నాయి. కానీ ఇద్దరూ కూడా స్పందించకపోవడంతో విడాకుల అంశానికి మరింత బలం చేకూరుతోంది.