రేసు గుర్రంలా పరుగెడుతున్న ఓటీటీ మార్కెట్..!

NAGARJUNA NAKKA
షేర్ మార్కెట్‌లో అయినా ఒడిదుడుకులు ఉంటున్నాయేమో గానీ.. ఓటీటీ మార్కెట్‌ మాత్రం స్పెయిన్‌ బుల్‌లా పరుగెడుతూనే ఉంది. ఇక అనుకోకుండా వచ్చిన ఈ బూమ్‌ని మరింత పెంచుకోవడానికి సినీ గ్లామర్‌ని నమ్ముకుంటున్నాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌. బిజినెస్‌ పెంచుకోవడానికి స్టార్‌హీరోలని రంగంలోకి దింపుతున్నాయి.
ఒకప్పుడు ఫ్రైడే వస్తోందంటే థియేటర్ల దగ్గర బోలెడంత హంగామా ఉండేది. స్టార్ హీరోల సినిమాలతో బాక్సాఫీస్ ఖుషీగా ఉండేది. కానీ పాండమిక్‌తో ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇండస్ట్రీ మొత్తం నష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే థియేటర్‌ బిజినెస్ పడిపోయినా.. ఓటీటీ మార్కెట్‌ మాత్రం ఫుల్లుగా పెరిగింది. మీడియం రేంజ్ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతున్నాయి.  
ఇండియాలో సినిమా, క్రికెట్‌ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్ మరొకటి లేదు. అయితే సెకండ్ వేవ్‌ తర్వాత క్రికెట్‌ మ్యాచులు జరుగుతున్నా ప్రేక్షకులని అనుమతించలేదు. ఇక థియేటర్‌కి వెళ్లడానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ భయపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ లాగే, ఇంటినుంచే ఎంటర్‌టైన్మెంట్‌ కోరుకుంటున్నారు. దీంతో ఓటీటీ బిజినెస్‌ కూడా పెరుగుతోంది. కరోనాకి ముందు 2019 చివరినాటికి 3.2 కోట్ల మంది ఉన్న ఓటీటీ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య, 2020 చివరికి 6.2 కోట్లకి చేరింది. అలాగే ఓటీటీ బిజినెస్ 11, 166 కోట్లకి చేరింది. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.  దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ రెట్టించిన ఉత్సాహంతో బిజినెస్‌ పెంచుకోవడానికి సినిమా స్టార్స్‌ని దింపుతున్నాయి.


రామ్ చరణ్‌కి మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కమర్షియల్ మూవీస్‌తో బీ,సీ సెంటర్స్‌లో భారీగా వసూల్ చేస్తుంటాడు. ఈ క్రేజ్‌నే వాడుకుంటోంది ఒక ఓటీటీ సంస్థ. చరణ్‌కి ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి ఈ హీరోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంటోంది. ఇందుకుగాను ఒక్కో ఏడాదికి 5-7 కోట్ల వరకు చెల్లిస్తున్నారట. షారుఖ్‌ ఖాన్‌కి 'చెన్నై పెక్స్‌ప్రెస్' తర్వాత పెద్దగా హిట్స్‌లేవు గానీ, ఆ ఫాలోయింగ్‌ మాత్రం తరగలేదు. ఇప్పటికీ షారుఖ్‌ కోసం సినిమాలకి వెళ్లే ఆడియన్స్‌ ఉన్నారు. ఈ క్రేజ్‌ చూసే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ షారుఖ్‌ని కాంటాక్ట్ అయ్యింది. బ్రాండ్‌ ప్రమోటర్‌ కమ్, వెబ్‌ సీరీస్‌ చేసేలా అగ్రిమెంట్‌ కుదుర్చుకుందట. ఇప్పటికే షారుఖ్‌ ఓ ప్రమోషన్ వీడియో కూడా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: