మెగాస్టార్‌లో ఎందుకంత ఆందోళ‌న‌.. ఇదే కార‌ణ‌మా...!

VUYYURU SUBHASH
మెగాస్టార్ చిరంజీవిలో ఇప్పుడు స‌రికొత్త ఆందోళ‌న క‌నిపిస్తోంది. మెగాస్టార్ ఏ విష‌యంలో అయినా చాలా కూల్‌గా ఉంటార‌న్న పేరుంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా అనంత‌రం టాలీవుడ్ కేంద్రంగా ఏపీ, తెలంగాణ‌లో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌తో ఆయ‌న తీవ్రంగా క‌ల‌త చెందుతున్నార‌ని ఆయ‌న మాట‌లే చెపుతున్నాయి. తాజాగా ల‌వ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పంక్ష‌న్ సాక్షిగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా అటు తెలంగాణ ప్ర‌భుత్వం, ఇటు ఏపీ ప్ర‌భుత్వం రెండు కూడా ఇండ‌స్ట్రీని త‌మ గెప్పుట్లో పెట్టుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్ లో ఉండ‌డంతో పాటు సినిమా జ‌నాల ఆస్తులు అన్ని కూడా అక్క‌డే ఉండ‌డంతో వాళ్లంతా కేసీఆర్‌కు జీ హుజూర్ అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇక సినిమా వాళ్లు త‌న‌ను ప‌ట్టించుకోక పోవ‌డం ద‌గ్గ‌ర నుంచి అనేక కార‌ణాలు సినిమా వాళ్ల‌పై జ‌గ‌న్‌లో కోపానికి కూడా ఓ కార‌ణ‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడు ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీని ఓ ఆటాడుకుంటున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ న‌లుగురు హీరోలు భారీగా రెమ్యున‌రేష‌న్లు తీసుకుని సంపాదించుకుంటారు.. మిగిలిన వారంతా ఇండ‌స్ట్రీలో చిన్న చిన్న‌గానే సంపాదించుకుంటార‌ని .. వారిపై ద‌య చూపాల‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీలోనే చెర్రీ -బ‌న్నీ - ప‌వ‌న్ - చిరు వీళ్లు న‌లుగురే రు. 50 కోట్లు తీసుకుంటారు.

బ‌య‌ట హీరోల‌లో ఎన్టీఆర్ - ప్ర‌భాస్ - మ‌హేష్ మాత్ర‌మే.. ఇండ‌స్ట్రీని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల ఎక్కువుగా న‌ష్ట‌పోయేది మెగా ఫ్యామిలీ మాత్ర‌మే. ఆ ఫ్యామిలీ హీరోల సినిమాలే యేడాదిలో 10 నుంచి 12 వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. చిరు ఆందోళ‌న‌తోనే ఇలా మాట్లాడార‌ని తెలుస్తున్నా.. మ‌రోవైపు స్టార్ హీరోలు సైతం త‌మ రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించు కోవాల‌న్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సినిమా వాళ్లు కోట్లు తీసుకుని.. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నార‌ని అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వాలు ఇండ‌స్ట్రీని, సినిమాను కంట్రోల్ చేస్తే త‌ప్పేంట‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: