మెగాస్టార్ కుటుంబానికి దేవుడిచ్చిన గొప్ప వరం ఉపాసన..!

Divya
జీవితం ఓ ఉపాసన.. మెగాస్టార్ కు.. ప్రేక్షకులకు మధ్య వారధిలా ఉపాసన జీవితం.. ఉపాసన మెగాస్టార్ చిరంజీవి కి కోడలిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భార్యగా, అపోలో చైర్ పర్సన్ ప్రతాపరెడ్డి మనవరాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పాటు చేసుకుంది. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కలిసి దాదాపు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకుని, ఆ తర్వాత వీరు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఎనిమిది సంవత్సరాల జీవితంలో మెగా ఫ్యామిలీలో మమేకమై, మెగా కుటుంబానికి ప్రేక్షకులకు తన జీవితాన్ని కొనసాగిస్తోంది.. వీరి కుటుంబంలో జరిగే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే చిరంజీవి మెగాస్టార్ సినిమా అప్ డేట్స్ అయినా సరే ముందుగా ప్రేక్షకులకు తెలిపేది ఉపాసన అని చెప్పవచ్చు.


కేవలం ఇంటి కోడలిగా మాత్రమే కాదు అపోలో హాస్పిటల్ లో ఉన్న అపోలో హెల్త్ విభాగానికి వైస్ చైర్మన్ గా కూడా ఉపాసన పనిచేస్తోంది. ఉపాసన ఎంతో దయనీయమైన హృదయం కలిగింది అని చెప్పడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. కరోనా  సమయంలో అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్న ఘనత  ఈమెకే దక్కింది. అంతేకాదు ఈ మధ్యకాలంలో తమ కుటుంబం లో  ఒకరైన సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లో  ప్రమాదానికి గురి అయితే, అపోలో హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు సమాచారం.

నిరుపేదలకు చేసిన పనులు ఏ రోజు కూడా చెప్పుకోలేదు అని, మెగా ఫ్యామిలీకి ఉపాసన కోడలిగా దొరకడం నా అదృష్టం అని ఇటీవల నాగబాబు కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక అంతే కాదు తన వార్తా పత్రికల ద్వారా సెలబ్రిటీల విశేషాలను కూడా తెలుసుకొని , సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. కరోనా కాలంలో ఎంతో మంది ప్రజలకు కరోనా పైన అవగాహన కల్పించి ,ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా చక్కగా తెలియజేసింది.. తద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు, ప్రజలకు దగ్గరగా ఉంటూ ఎంతో అభిమానాన్ని చూరగొంది ఉపాసన.. ధనవంతురాలు అనే స్వభావం ఏమాత్రం చూపకుండా, కేవలం ఒక సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికీ అందుబాటులో ఉంది మెగాస్టార్ కోడలు ఉపాసన.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: