విజయ్ సేతుపతి.. ఏంటి ఆ సినిమా లు?

P.Nishanth Kumar
ప్రస్తుతం సౌత్ ఇండియా లో మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ సేతుపతి ఇటీవల కాలంలో అన్ని భాషల చిత్రాల్లో నటిస్తూ అన్ని భాషలలోనూ ప్రేక్షకాభిమానాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో ఆయనకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే కథ నచ్చి తనకు పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాల్లో అయినా నటించడానికి వెనకాడరు విజయ్ సేతుపతి.

ఈ నేపథ్యంలోనే ఆయన పది నిమిషాల నిడివి ఉన్న చిత్రంలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో ఉప్పెన సినిమా లో విలన్ గా నటించి ప్రేక్షకుల పై తనదైన ముద్ర వేసుకున్నాడు. అంతే కాదు ఆయన తమిళంలో చేసిన చాలా చిత్రాలు ఇప్పుడు తెలుగులో విడుదల అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నాయి. ఇదిలా ఉంటే కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆయన తాను నటించిన మూడు సినిమాలు వివిధ రకాల మార్గాల ద్వారా విడుదల కాగా వాటితో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.

ఆయన హీరోగా నటించిన లాభం సినిమా థియేటర్లలో విడుదల కాగా అనబెల్ సేతుపతి సినిమా హాట్ స్టార్ లో విడుదల అయ్యింది. అంతేకాదు ఆయన నటించిన మరొక సినిమా నెట్ ఫ్లిక్స్ లో తుగ్లక్ దర్బార్ విడుదల కాగా ఈ మూడు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాయి అనే టాక్ వస్తుంది. తుగ్లక్ దర్బార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంత వరకు పర్వాలేదు అనిపించుకుంది. థియేటర్లలో విడుదలైన లాభం సినిమా చూసి ఏమాత్రం లాభం లేదు అని ప్రేక్షకులు వాపోతున్నారు. ఇక హాట్ స్టార్ లో విడుదలైన అనబెల్ సేతుపతి  సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ సినిమా చూస్తే ప్రేక్షకులకు తప్పకుండా విరక్తి పుట్టడం ఖాయం. అయితే ఇలాంటి నాసిరకం సినిమాలు చేసి విజయ్ సేతుపతి తన క్రేజ్ ను పోగొట్టుకోవద్దు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తన రేంజ్, క్రేజ్ పెరిగేలా ఉండే సినిమాలు చేయాలని ఆయనకు సలహాలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: