ఊహించ‌ని ప్ర‌మాదంలో టాలీవుడ్‌... !

VUYYURU SUBHASH
దేశం గ‌ర్వించ ద‌గ్గ స్థాయిలో ఉన్న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ టాలీవుడ్ ఇప్పుడు పెను సంక్షోభంలో ప‌డిందా ?  టాలీవుడ్ క్రేజ్ ప‌డిపోనుందా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే చెపుతున్నాయి. గ‌త నాలుగేళ్లుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ బాలీవుడ్‌ను ఢీ కొట్టేసి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రేంజ్‌కు దూసు కు వెళ్లే స్థాయిలో ఉంది. అస‌లు త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ‌ను మ‌నం ఎప్పుడో బీట్ చేసి ప‌డేశాం. బాహుబ‌లి, సాహో లాంటి సినిమాలు దేశ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకునేలా చేశాయి. క‌ట్ చేస్తే క‌రోనా దెబ్బ‌కు చాలా వ‌ర‌కు సినిమా ప‌రిశ్ర‌మ కుదేలైంది. అయితే ఇది ప్ర‌పంచ వ్యాప్తంగానే ఉంది.

ఆ త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ప‌రిణామాలు మాత్రం ఇండ‌స్ట్రీ ని ప్ర‌మాదంలో ప‌డేస్తున్నాయి. ఇటు కేసీఆర్ ప్ర‌భుత్వం, అటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీ వాళ్ల‌ను ఓ ఆటాడుకుంటున్నాయి. తెలంగాణ‌లో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఎవ్వ‌రూ నోరు మెదిపే ప‌రిస్థితి లేదు. తెలంగాణ‌లో ఎలా ఉన్నా ఏపీలో ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఇండ‌స్ట్రీ వాళ్లు అస్స‌లు మాట్లాడే ప‌రిస్థితి కూడా లేదు. ఏపీలో టిక్కెట్ల రేట్లు త‌గ్గించేశారు. ఇవి 1990వ సంవ‌త్స‌రంలో ఉన్న రేట్ల స్థాయిలో ఉన్నాయి.

ఇక ఇప్ప‌ట‌కీ థియేట‌ర్లు ఓపెన్ అయినా సెకండ్ షోల‌కు ఇప్ప‌ట‌కీ అనుమ‌తులు లేవు. ఎప్ప‌ట‌కి ఉంటాయో తెలియ‌దు. క‌రోనా స‌మ‌యంలో విద్యుత్ చార్జీలు, ప‌న్నుల నుంచి మిన‌హా యింపులు వ‌స్తాయ‌ని ఎదురు చూస్తున్నా దాని ఊసే లేదు. ఇక చాలా మంది త‌మ సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో స్టార్ల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ?  కూడా తెలియ‌డం లేదు. స్టార్ డ‌మ్‌ను ఎంజాయ్ చేసే స్టార్ హీరోల‌కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి.

ఘోరంగా దెబ్బ‌తిన్న సినిమా పరిశ్రమను బ్రతికించడానికి ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ తమ గుత్తాధిపత్యంలోకి సినిమాను తెచ్చుకోవాల‌ని రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు చూస్తుండ‌డంతో ఓవ‌రాల్‌గా సినిమా ప‌రిశ్ర‌మే దెబ్బ తినేలా ఉంది. ఇక జ‌గ‌న్ స‌ర్కార్ టిక్కెట్ల‌ను కూడా ఆన్ లైన్ లో విక్ర‌యించాల‌న్న కండీష‌న్ పెట్ట‌డంతో చాలా థియేట‌ర్లు కూడా మూత‌ప‌డ‌నున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: