'మెగాస్టార్' పేరును సార్థకం చేసుకుంటున్న చిరు

Vimalatha
మెగాస్టార్ చిరంజీవి... ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇండస్ట్రీలో ఏం జరిగినా ? ఏం జరగాలన్నా ఆయన బాధ్యత వహించాల్సిందే. గతంలో అన్నింటికి ముందుండి నడిపించేవాడు దాసరి నారాయణ రావు. ఆయన చనిపోయాక టాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు ఉండడంతో ఎవరు బాధ్యత తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మెగాస్టార్ ముందుకొచ్చి ఇండస్ట్రీ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. 'మా' ఎలక్షన్స్ నుంచి సినిమాల వరకూ అన్నింటా ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. సమస్యల విషయంలో ఆయనే ముందుండి పరిష్కరిస్తున్నారు.

 
మరోవైపు సామాజిక బాధ్యతను కూడా మోస్తూ "చిరంజీవి బ్లడ్ బ్యాంకు","ఆక్సిజన్ ప్లాంట్" అంటూ ప్రజలకు మేలు చేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదేమో అన్పిస్తుంది. ఇక యంగ్ స్టార్స్ కంటే ఎక్కువగా ఆయన సోషల్ మీడియాలో ఉంటూ పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఆరేళ్ళ పాప రేప్ ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంపై స్పందిస్తూ సమాజం, పౌరులు బాధ్యతగా ఉండాలని, ఇలాంటివి జరగకుండా చేసే కార్యక్రమాలకు మద్దతుగా ఉంటానని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

 
ఇక సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా వారిని ప్రశంసించడానికి కూడా చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. చిరు ప్రశంసలు ఎవరికైనా బూస్ట్ ను ఇవ్వాల్సిందే కదా. మరోవైపు సినిమా సమస్యల విషయంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. చిరు వాటిని పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో స్పోర్ట్స్ లో భారత దేశం తరపున టోక్యో ఒలంపిక్స్ లో సత్తా చాటిన మీరా బాయి చాను అయినా మన తెలుగు తేజం పీవీ సింధు అయినా ఆయన పొగడ్తలకు స్ఫూర్తి పొందాల్సిందే. అలా ఆయన అటు సమాజం, ఇటు సినిమాలు అన్ని విషయాల్లోనూ తన సపోర్ట్ ను అందిస్తూ 'మెగాస్టార్' పేరును సార్థకం చేసుకుంటున్నారు చిరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: