ఆ సినిమాలో ఏఎన్నార్.. 9 పాత్రల్లో నటించారట?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో నటసామ్రాట్ గా తెలుగు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఏఎన్నార్ భౌతికంగా   తెలుగు ప్రజలకు దూరమైనప్పటికీ ఆయన చేసిన సినిమాలు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 70 ఏళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా కొనసాగిన ఏఎన్నార్ చిత్ర పరిశ్రమ కీర్తిని పెంచే విధంగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎన్నో అవార్డులు రివార్డులు సైతం సొంతం చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు అప్పటివరకు ద్విపాత్రాభినయం అన్న సంగతి తెలియదు. కానీ అక్కినేని నాగేశ్వరావు మొదటి సారి తెలుగు చిత్ర పరిశ్రమలో ద్విపాత్రాభినయం చేసి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని చెప్పాలి. అయితే ఆయన నటనతో తెలుగు ప్రేక్షకులు అందరినీ మంత్రముగ్ధులను చేసిన నాగేశ్వరరావు కెరీర్లో ఆయన నటన విశ్వరూపానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఒక సినిమా. ఏకంగా ఒకే సినిమాలో 9 పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు నటసామ్రాట్ నాగేశ్వరరావు.

 1966వ సంవత్సరంలో నవరాత్రులు అనే సినిమాలో నటించారు అక్కినేని నాగేశ్వరరావు. ఈ సినిమాలో ఏకంగా 9 పాత్రల్లో నటించి నట విశ్వరూపం చూపించారు. ఇక ప్రతీ పాత్రలో కూడా ఒదిగిపోయి నటించారు..  పాత్రకు ప్రాణం పోశారు అనే చెప్పాలి.  ఇలా ఒకే సినిమాలో 9 పాత్రల్లో నటించిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ కీ తెరలేపారు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు.  అక్కినేని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన మనం సినిమాలో చైతన్య పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే తెలుగు ప్రేక్షకుల నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anr

సంబంధిత వార్తలు: