రక్తంతో ప్రేమ లేఖ రాసిన స్టార్ కమెడియన్ తమ్ముడు..?

Divya
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ సంఘవి అందరికీ బాగా గుర్తుంటుంది. ఈమె ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈమె టాలీవుడ్ లోకి.."లాహిరి లాహిరి లాహిరి లో"అనే సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేసింది. ఆ తరువాత దాదాపుగా 95 సినిమాలకు పైగా నటించింది హీరోయిన్ సంఘవి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఒక స్టార్ కమెడియన్ తమ్ముడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె శివయ్య సినిమా దర్శకుడు సురేష్ వర్మ ను ప్రేమించి వివాహం చేసుకున్నది. ఆ తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టలేదు. ఈమె గతంలో ఒకసారి ఒక టీవీ ప్రోగ్రాం లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
ఈమె అసలు పేరు కావ్య రమేష్.. ఈమెది కర్ణాటకలోని మైసూర్లో జన్మించింది. తను చదువుతున్న వయసులోనే సినిమాలో నటించాలనే కోరిక ఉండడంతో.. చైల్డ్ యాక్టర్ గానే పలు సినిమాలలో నటించిందట. అంతేకాకుండా ఈమె బుల్లితెర పై కూడా పలు సీరియల్స్ లో నటించినట్లు సమాచారం. ఇక ఈమెకు ఒక స్టార్ కమెడియన్ తమ్ముడు అప్పట్లో ఒక ప్రేమ లేఖలు రాశారని తెలిపింది. ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు కమెడియన్ ఆలీ తమ్ముడు.. ఖయ్యుమ్.

కాలేజీలో చదువుకునేటప్పుడు ఖయ్యుం తనకి జూనియర్ అని తెలిపింది. తన తమ్ముడు చేసిన పని ఆలీ ముందే చెబుతూ.. కాలేజీలో ఆ రోజుల్లో మీ తమ్ముడు నాకు ఎన్నో లవ్ లెటర్స్ రాశాడు అంటూ తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు తన రక్తంతో కూడా రాసి ప్రేమ లేక ఇచ్చేవాడు అన్నట్లుగా తెలియజేసింది. ఇక అలా చెప్పడంతో ఆలీ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఆలీ ఈ విషయం నాకు అసలు తెలియదు అని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: