చైతూని పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్..

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ నటుడు మన్మధుడు అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ వున్నా కాని అందరి హీరోలలాగా రొటీన్ గా కమర్షియల్ మాస్ సినిమాలు మాత్రమే చెయ్యకుండా మంచి మంచి ప్రేమ కథ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో ప్రేమ కథా సినిమాలకు చైతన్య కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచాడు. మంచి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు తీయాలంటే అందరి దర్శకనిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు నాగ చైతన్యనే.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులకి మరో మరపురాని ప్రేమకథని చూపించబోతున్నాడు. నాగ చైతన్యకి జంటగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధులుగా హాజరవ్వడం జరిగింది.
ఇక ఈ వేడుకలో చిరంజీవి నాగ చైతన్యని పొగడ్తలతో ముంచెత్తాడు.ఇక చిరంజీవి నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.." "లవ్ స్టోరి" సినిమా టైటిల్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రేమ కథ సినిమాలు చూసి చాలా కాలం అవుతోంది. నా మిత్రుడు నాగార్జున అబ్బాయి నటించాడు.ఇందాక అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పడం జరిగింది.లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించాడు. వినగానే చాలా కంఫర్ట్ గా అనిపించింది, అతను మంచి యాక్టర్ అని. ఆ మాట వింటే నాకూ చాలా సంతోషమేసింది. నాగ చైతన్య మంచి కుర్రాడు.చాలా మంది కూడా సక్సెస్, ఫెయిల్యూర్స్ కు ఎగిరిపడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అందుకే మిత్రుడు నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇక ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా చాలా నిర్మాణాత్మకంగా సాగుతోంది.చైతూ సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పగలను. చైతన్య మంచి కథలు ఎంచుకుంటాడు, ఎంతో సెలెక్టివ్ గా ఇంకా ఎంతో కొత్తగా సినిమాలు చేస్తుంటాడు.ఇక "లవ్ స్టోరి" సినిమా కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చైతూ.ఇక నాగ చైతన్య, నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా చూడాలని ఎదురు చూస్తున్నాను." అని చిరంజీవి అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: