చైతు మామూలోడు కాదుగా, అమీర్ నే ఇంప్రెస్ చేసేశాడు..

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున పెద్ద కొడుకు టాలీవుడ్ లవర్ బాయ్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ కిడ్ అయ్యుండి కూడా అందరిలా రొటీన్ గా కమర్షియల్ సినిమాలే చెయ్యకుండా మంచి మంచి సెన్సిబుల్ లవ్ స్టోరీ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలకు ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచాడు. మంచి మంచి సెన్సిబుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు తీయాలంటే అందరి దర్శకనిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా మారాడు. ఇక ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులకి మరో మరపురాని ప్రేమకథని చూపించడానికి రెడీ అవుతున్నాడు.సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దేశం గర్వించదగ్గ నటుడు అమిర్ ఖాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినిమా ఫంక్షన్లకు హాజరు కావడం అనేది మాములు విషయమే. కాని అమీర్ ఖాన్ లాంటి గొప్ప నటుడు హాజరు కావడం అనేది ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇక తను ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక చైతూ నటనకి అతని ప్రవర్తనకి అమీర్ ఖాన్ బాగా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా వేడుకకు హాజరు అయ్యాడు. అలాగే స్టేజ్ పై చైతూ మీద అమీర్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ సినిమాని ఖచ్చితంగా 24 వ తేదీన థియేటర్ లో చూడాలనుకుంటున్న అని ఖచ్చితంగా చూస్తాను అని అన్నాడు.చైతూ ప్రవర్తనను ఇంకా తన నటనను మెచ్చుకుంటూ చైతూ తల్లి దండ్రులు అయినా నాగార్జున, లక్ష్మి గార్లకు థాంక్స్ చెప్పాడు. నాగ చైతన్యని చాలా మిస్ అవుతున్నామంటూ స్టేజ్ పైన అమీర్ చెప్పాడు. మొత్తానికి నాగ చైతన్య అమీర్ ఖాన్ నే ఇంప్రెస్ చేసాడంటే రియల్లీ గ్రేట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: