బాలయ్య విషయంలో బోయపాటి ఎపుడూ అలాగే.... ?

Satya
బోయపాటి ఫస్ట్ మూవీ భద్ర. హీరో మాస్ మహారాజా రవితేజా. ఈ మూవీ హిట్ అయింది. ఆ తరువాత వెంకటేష్ తో తులసీ మూవీ తీసి డీసెంట్ హిట్ కొట్టిన బోయపాటి మూడవ సినిమాకు మాత్రం నందమూరి వారి కాంపౌండ్ కి చేరాడు.
సింహా మూవీతో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టోటల్ ఇండస్ట్రీని ఆకట్టుకున్నాడు. అదే మ్యాజిక్ ని లెజెండ్ తో రిపీట్ చేసిన బోయపాటి బాలయ్య ఫ్యాన్స్ కి హాట్ ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక బోయపాటి బాలయ్యల హ్యాట్రిక్ మూవీ అఖండ మీదనే అందరి దృష్టీ ఇపుడు ఉంది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని కూడా అంటున్నారు.
లెజెండ్ వచ్చిన ఏడేళ్ళకు ఈ మూవీ వస్తోంది. సింహాకు, లెజెండ్ కి మధ్య నాలుగేళ్ల గ్యాప్ ఉంది. ఇపుడు రెట్టింపు గ్యాప్ వచ్చినా కూడా బోయపాటి బాలయ్య మధ్యన ఉన్న ఆ బంధం మరింతగా గట్టిపడింది కానీ ఎక్కడా తగ్గలేదు. ఇక బాలయ్యతో ఎంతో మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు. హిట్లూ కొట్టారు. కానీ బోయపాటికి మాత్రం బాలయ్య పూర్తిగా పూనేశాడు అనే చెప్పాలి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ తో సహా ఆయన ప్లస్ మైనస్సులు అన్నీ పూర్తిగా స్టాడీ చేసిన ఏకైక డైరెక్టర్ బోయపాటి అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
బోయపాటి సినిమాలలో బాలయ్య ఎంత మాస్ గా కనిపిస్తారో అంత క్లాస్ గానూ కనిపిస్తారు. సింహాలో బంగారు కొండా అంటూ నయనతారతో సాగే సాంగ్ బాలయ్య అందాన్ని క్లాసిక్ మ్యానరిజాన్ని ఎలివేట్ చేసింది. ఇక లెజెండ్ లో బాలయ్య రాధికా ఆమ్టే  జంటగా వచ్చిన నీ కంటి చూపుల్లోన సాంగ్ మెలోడీగా సాగుతుంది. బాలయ్య  హుందాతనాన్ని చాటింది. ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన అఖండలోని అడిగా అడిగా సాంగ్ కూడా అలాగే సాగుతుంది. ఈ సాంగ్ లో  ప్రగ్యా జైశ్వాల్ తో బాలయ్య అందంగా సాగుతూ ఉంటే నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. ఇక బాలయ్య అందంగా ఉంటాడు, కానీ కొందరు మాత్రమే ఆయన్ని స్క్రీన్ మీద అందంగా ప్రెజెంట్ చేయగలరు. వారిలో బోయపాటి ఫస్ట్ అని చెప్పాలి. సో బోయపాటి ఎపుడూ బాలయ్య విషయంలో అలాగే ఉంటాడు అంటున్నారు ఫ్యాన్స్. ఇక అఖండ సూపర్ డూపర్ హిట్ అని చెప్పేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: