పవర్ స్టార్ తోటి ఆర్టిస్ట్ లతో అలా నడుచుకుంటారట...!

murali krishna
సినిమా హిట్ కొట్టాలి అన్నా మరియు ప్లాప్ అవ్వాలన్నా అందులో హీరో పాత్ర ఎంత కీలకమో అందరికి తెలుసు..అలాగే సినిమాలో హీరో పాత్రకు అదే స్థాయిలో ప్రతినాయకుడి పాత్రకు కూడా ఉంటుందని అందరికి తెలుసు. అందుకే హీరోకి ఏ స్థాయిలో అయితే క్రేజ్ ఉంటుందో అంతే స్థాయిలో
విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది..ఇక పోతే... జిల్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన నటుడు కబీర్ దూహాన్ సింగ్. ఆ సినిమా విడుదల అయ్యి దాదాపు ఇప్పటికి 5 ఏళ్లు అవుతున్న  తన అభిమానులు ఇంకా ఆయనకు మెసేజెస్ చేస్తూ ఉంటారని కబీర్ తెలిపారని సమాచారం.
ఇదిలా ఉండగా...తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కబీర్ దూహాన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం బీమ్లా నాయక్. దుహాన్ విలన్ క్యారక్టర్ పోషిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే. కాగా పవన్ కల్యాణ్ గురించి చెప్తూ ఆయన్ని కలవడం ఇదే మొదటి సారి అని ఆయన అందరితో చాలా హంబుల్ గా ఉంటారని తెలిపారని సమాచారం.. వినయం తెలిసిన మనిషి అని దుహాన్ ప్రశంసించారని తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన ఆర్టిస్టులందరితోనూ చాలా పద్ధతిగా నడుచుకుంటారని చెప్పారట మొత్తంగా ఆయనతో 37 రోజులు కలిసి పనిచేశానని దుహాన్ తెలిపారని సమాచారం.పవన్ కల్యాణ్ తో చేసే అవకాశం తనకు వకీల్ సాబ్ సినిమాకే వచ్చిందని చెప్పారట . కానీ ఆ టైం లో నాకు డేట్స్ సర్దుపాటు చేయలేక పోయామని ఆయన అన్నారని సమాచారం. ఫైనల్ గా పవన్ జెంటిల్ మేన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడట దూహాన్.
  ఇక సినిమా విషయానికొస్తే తాను సినిమా చిన్నదా లేదా పెద్దదా అని చూడనని కేవలం కంటెంట్ ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఓకె చెప్తానని ఆయన అన్నారని సమాచారం.చాలా మంది తెర ముందు విలన్లుగా నటించినా... అది తెర వెనుక ఉన్న వారి నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని దుహాన్ చెప్పారని సమాచారం. స్పీడున్నోడు సినిమాలో ప్రకాష్ రాజ్ హీరో తండ్రిగా చేశారని చెప్పారట.. సినిమాలో ఎలా ఉన్నా... బయటకు మాత్రం ఆయన చాలా బాగా మాట్లాడే వారని దుహాన్ తెలిపినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా తమిళ్ లో చాలా ఫేమస్ అయిన అజిత్ అంటే... తనకు చాలా అభిమానం అని ఆయన తెలిపారని తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన సెట్ లో ఉన్న అందరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తారని చెప్పారట. అలాగే అజిత్  తన తండ్రితో సమానం అని దూహాన్ తన అనుభవాలను పంచుకున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: