తెరపైకి విక్రమార్కుడు2.. డైరెక్టర్, హీరో మారతారా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రవితేజకు మరిచిపోలేని హిట్ అందించిన ఈ సినిమా మళ్లీ సీక్వెల్ కి రెడీ అవుతుంది అన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. రవితేజ అభిమానులకు ఇది ఎంతగానో సంతోషపెట్టే వార్త. ఇటీవలే క్రాక్ లాంటి సూపర్ హిట్ అందుకున్న రవితేజ మరొకసారి పోలీస్ ఆఫీసర్ గా నటించిన విక్రమార్కుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటే ఆ సినిమా కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంచనా కు వస్తారు ఆయన అభిమానులు.

విజయేంద్రప్రసాద్ కథ రాజమౌళి దర్శకత్వం రవితేజ డబల్ యాక్షన్ అలాగే విలన్ గా అజయ్ భీకరమైన నటన కలగలిపి ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా వారికి మరిచిపోలేని హిట్ ను అందించింది విక్రమార్కుడు సినిమా. చంబల్ ప్రాంతానికి పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళిన హీరో అక్కడ ప్రజలను తీవ్రంగా హింసిస్తున్న విలన్ భరతాన్ని ఎలా పట్టాడు ఆ క్రమంలో తాను చనిపోయిన తరువాత తన ప్లేస్ లోకి అచ్చం తనలాగే ఉన్న మరొక హీరో ఏ విధంగా విలన్ ను చంపి తన కూతురును సొంత కూతురు లా చూసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. 

ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. రొమాంటిక్ సీన్లలో వీరిద్దరూ బాగా ఒదిగిపోయారు అని చెప్పవచ్చు. అనుష్కకు స్టార్డమ్ తెచ్చి పెట్టి స్టార్ హీరో గా మార్చిన సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో రవితేజ నటన గురించి చెప్పాలి ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ లో ఆయన వేరే రేంజ్ లో ఉంది. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం రవితేజ ఎంతో మనసుపెట్టి చేశాడు అనిపిస్తుంది. తలలో పెద్ద అణుబాంబు పెట్టుకొని తిరుగుతున్న వ్యాధిగ్రస్తుడు లా, పోలీస్ ఆఫీసర్ గా ఓ ఓ దొంగగా రవితేజ మూడు డిఫరెంట్ పాత్రలలో నటించి ఈ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. అయితే ఈ విక్రమార్కుడు సినిమా లో దర్శకుడిగా రాజమౌళి హీరో గా రవితేజ ఉండడు అనే వార్త వినిపిస్తుంది.  మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఈ చిత్రం యొక్క అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: