40 ఏళ్ళ వయసులో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త !

Vimalatha
ఆరోగ్యం ఒక సంపద అని పెద్దలు అనడం మనం వింటూనే ఉంటాము. అందుకే వ్యాధిలను దరి చేరనీయకుండా ఉండడానికి అందరూ తమను తాము వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్, నొప్పిని తట్టుకునే శరీర సామర్థ్యం తగ్గుతుంది. సకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపించడం ప్రారంభం అవుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గించవచ్చు.
వృద్ధాప్యం అనేది జీవితంలో ఒక సహజ దశ. దానిని ఆపడానికి మనం చేయగలిగేది ఏమీ ఉండదు. కానీ కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఆ దశలోనూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 30 సంవత్సరాల వయస్సులో శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. కానీ 40 సంవత్సరాల వయస్సులో పరిస్థితులు మారతాయి. ముఖ్యంగా ఈ కింద ప్రస్తావించబోయే లక్షణాలు 40 ఏళ్ళ వయసులో మగవాళ్లలో కనిపిస్తే వాటిని పొరపాటున కూడా నెగ్లెక్ట్ చేయకండి.
ఆకస్మికంగా బరువు పెరగడం
మీరు అకస్మాత్తుగా బరువు తగ్గినా లేదా బరువు పెరిగినా... మీ శరీరంలో ఆ మార్పు ఎందుకు జరిగిందో తెలియకపోతే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. మధుమేహం బరువు తగ్గడానికి దారితీస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వులు వేగంగా బరువు పెరగడానికి దారి తీస్తాయి. అందుకే మీరు ఎప్పటికప్పుడు చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ని చెక్ చేస్తూ ఉండాలి.
గుండెల్లో మంట
కొన్ని సార్లు తినే పదార్థాలు, జీర్ణక్రియ సమస్యల కారణంగా గుండెల్లో మంటలా అన్పించొచ్చు. అయితే ఇలా పదేపదే జరిగిందంటే మాత్రం దానిపై దృష్టి పెట్టాలని అర్థం. బలహీనమైన గుండె, అనారోగ్యానికి ఈ మంట కారణం కావచ్చు.
తరచుగా తలనొప్పి
మీకు తరచుగా తలనొప్పి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏదైనా తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే అరికట్టాలంటే ఖచ్చితంగా నిపుణుల సలహాలను తీసుకోండి.
కీళ్ళ నొప్పి
కీళ్ల నొప్పులు అంటే మీ శరీరం రోజురోజుకు బలహీనపడుతోంది. ఈ సమస్యను నివారించడానికి, సరైన సమయంలో చికిత్స పొందడానికి వైద్యుడిని సంప్రదించండి.
తరచుగా మూత్ర విసర్జన
మూత్రాన్ని నియంత్రించడంలో మీకు ఇబ్బంది అనిపించినా, రోజుకు చాలా సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చినా ఇది ఒక ముఖ్యమైన ఆయోగ్య హెచ్చరికకు సంకేతం. డయాబెటిస్ అయ్యి ఉండొచ్చు. వైద్యులను సంపాదించండి.
వెన్నునొప్పి
మీకు మెడ నుండి నడుము వరకు భరించలేని నొప్పి ఉంటే మీ వెన్నెముక ఎముకలు బలహీనంగా ఉందని అర్థం. ఇది మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. అందువల్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: