ఎన్టీఆర్ మూవీ కోసం మెగాస్టార్ తో పాటు ఆయన కూడా .... ??

GVK Writings
ప్రస్తుతం సూపర్ డైరెక్టర్ రాజమౌళి తో ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో చరణ్ కూడా మరొక హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తుండగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, అలానే బాలీవుడ్ నటి అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
అయితే దీని తరువాత కొరటాల శివ తో మరొక భారీ ప్రాజక్ట్ చేయనున్నారు ఎన్టీఆర్. ప్రముఖ సంస్థలు యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుండగా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దీనికి సంగీతం అందించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే వచ్చే నెల మొదటి వారంలో ఈ మూవీ అధికారిక పూజా కార్యక్రమాలు జరగనుండగా ఆ వేడుకకి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ వేడుకకి సూపర్ స్టార్ మహేష్ కూడా స్పషల్ గెస్ట్ గా రానున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే మహేష్ ని కలిసిన ఎన్టీఆర్, కొరటాల ఆయనని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారట. ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా దర్శకనిర్మాతలు ఎంతో గ్రాండ్ లెవెల్లో తీయనున్న ఈ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వీలైనంత త్వరలో పూర్తి చేసి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: