డ్ర‌గ్స్ కేసులో ఆ ఇద్ద‌రికి క్లీన్ చీట్‌?

Dabbeda Mohan Babu
డ్ర‌గ్స్ కేసు యావ‌త్‌ టాలివుడ్ ఇండ‌స్ట్రీ ని మొత్తం హ‌డ‌లెత్తిచింది. ఎంతో మందికి కంటి పై కునుకు లేకుండా ఈ డ్ర‌గ్స్ కేసు ఉంది. హీరో ల నుంచి మొద‌లు, హిరోయిన్లు, డైరెక్ట‌ర్ లు, క‌మిడియెన్ లు అంటు ఎవ‌రు తేడా లేకుండా అంద‌రూ ఈ కేసు లో భాగంగా ఉన్నార‌ని ప‌లువురు అన్నారు. ఈడీ కూడా ఈ కేసును చాలా సీరియ‌స్ తీసుకుని విచారించింది. దీనిలో ఎవ‌రేవ‌రూ ఉన్నారో అంద‌రినీ బ‌య‌ట‌కు లాగింది. ఇప్ప‌టికే 12 మంది సినీ ప్ర‌ముఖుల‌కు నోటిసులు ఇచ్చి వారంద‌రి పై విచార‌ణ జ‌రిపారు. ఒక్క‌క‌రిని ఒక్కోరోజు విచార‌ణ‌కు పిలిచి వారి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుక‌లు సేక‌రించింది.

అందులో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో పాటు హిరోలు త‌రుణ్‌, త‌నీష్, రానా, ర‌వితేజా, న‌వ‌దీప్ ల‌ను అలాగే హిరోయిన్ లు చార్మీ, ర‌కుల్ ప్రిత్ సింగ్ తో పాటు న‌టులు నందు, శ్రీనివాస్‌, ముమైత్ ఖాన్ ల‌కు ఈడీ నోటిసులు జారీ చేసింది. అలాగే వీరిని విచార‌ణ కూడా  చేసింది. ఈ డ్ర‌గ్స్ వ్య‌వ హారం మొత్తం న‌వ‌దీప్ కు చెందిన ఎఫ్ క్ల‌బ్ లోనే జ‌రిగింద‌ని ఈడీ అనుమానించింది. వీరికి డ్ర‌గ్స్ స‌ప్లేయ‌ర్ కెల్విన్ కు సంబంధ‌లు ఉన్నాయ‌ని, వీరి మ‌ధ్య ఆర్థిక లావాదేవీలు జ‌రిగాయాని ఈడీ అనుమానించింది. అందులో భాగంగానే, అదే కోణంలో విచార‌ణ జ‌రిగింద‌ని తెలుస్తుంది.

అయితే తాజా  ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)  దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్‌లకు క్లీన్ చిట్ ఇచ్చింది.  వీరి ఇద్ద‌రు డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ వెల్లడించింది. వీరి రక్తం, గోళ్లు, వెంట్రుక‌లను స్వ‌చ్ఛంధంగా ఈ డీ సేకిరంచిందిని వాటి ఆధారంగా టెస్టు లు చేస‌మ‌ని రిపోర్ట్‌లో డ్రగ్స్ తీసుకున్న‌ట్టు లేద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ఈ కేసులో ముఖ్య పాత్ర అయిన కెల్విన్‌పై ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను  ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కోర్టుకు సమర్పించింది.  అలాగే ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించింది. అందులోభాగంగా ప్రధాన నిందితుడు కెల్విన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న కెల్విన్ త‌ప్ప‌ని స‌రిగా కోర్టు హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: