బిగ్ బాస్ సిజ‌న్ 5 హౌస్ లోకి రామ్ చ‌ర‌ణ్‌?

Dabbeda Mohan Babu
నాగార్జున వ్యాఖ్యాత గా నిర్వ‌హిస్తున్న బిగ్ బాస్ సిజ‌న్ 5 మంచి టీఆర్పీతో మా టీవీ లో ప్ర‌సారం అవుతుంది. ఈ సారి బిగ్ బాస్ లో 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ప్ర‌తి సారి కంటే ఈ సిజన్‌లో కాస్త మ‌సాలా ఎక్కువ గానే ఉటున్న‌ట్టు తెలుస్తుంది. అందుకే యాంక‌ర్ ర‌వి, లోబో ల మ‌ధ్య గోడ‌వ లు పెట్టిస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ష‌న్ముక్ జ‌స్వంత్ తో ప్రేమాయ‌ణం న‌డిపించాల‌ని కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ సిజ‌న్ 5 స్టార్ట్ అయి రెండు వారాలు కాక ముందే కంటెస్టెంట్ల మ‌ధ్య గోడ‌వ తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ గోడ‌వ‌లు బిగ్ బాస్ సిజ‌న్ 5 చివ‌రి వ‌ర‌కు కంటీన్యూ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. టీఆర్పీ రేటింగ్ పెంచ‌డానికి నిర్వ‌హ‌కులు ఇప్ప‌టికే చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. అందులో భాగంగానే మెగ ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ను రంగం లోకి దింపుతున్న‌ట్టు స‌మాచారం.

మెగ ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్టార్ గ్రూప్ లో భాగ మైన డిస్ని హాట్ స్టార్ కు అంబాసిడ‌ర్ గా ఎంపిక‌యిన విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ ను కూడా స్టార్ గ్రూప్ సంస్థ వారే నిర్వ‌హిస్తున్నారు. బిగ్ బాస్ షో కూడా డిస్ని హాట్ స్టార్ లోనే ప్ర‌సార‌మ‌వుతుంది. అందు వ‌ల్ల బిగ్ బాస్ సిజన్ 5 కి టీఆర్పీ రేటింగ్  పెంచెందుకు రామ్ చ‌ర‌ణ్ ను వాడుకోవాలని స్టార్ గ్రూప్ ఆలో చిస్తుంద‌ని స‌మాచారం. అందులో భాగంగా నే త్వ‌ర‌లో బిగ్ బాస్ హౌస్ కు రామ్ చ‌ర‌ణ్ ను తీసుకురావాల‌ని ప్లాన్ వేస్తున్నార‌ని తెలుస్తుంది. ఈ విష‌యాన్ని రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద ప్ర‌స్థావించార‌ని దానికి రామ్ చ‌ర‌ణ్ కూడా ఒప్పుకున్నార‌ని స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చే ఎపీసోడ్ కోసం పెద్ద ప్లాన్ కూడా వేశార‌ని తెలుస్తుంది. బిగ్ బాస్ లో రామ్ చ‌ర‌ణ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఎన్ టీఆర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా లో రామ్ చ‌ర‌ణ్ అల్లురీ సీత‌రామ‌రాజ్ పాత్ర ను పోషిస్తున్నాడు. అలాగే తార‌క్ కొమ‌రం భీం పాత్రలో న‌టిస్తున్నాడు. కాగ ఈ సినిమా కు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క‌థ‌ను విజయేంద్ర ప్ర‌సాద్ అందిస్తున్నాడు. దీని త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ దిల్ రాజ్ నిర్మాణంలో సినిమా చేయ‌నున్న‌డు. దీనికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నాడు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా కీయారా అద్వానీ న‌టిస్తోంది. ఈ సినిమా టైటిల్ తెలియాల్సి ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: