రాజ్ కుంద్రా కేసులో ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా స్టేట్మెంట్

Vimalatha
గత కొన్ని నెలల నుంచి రాజ్ కుంద్రా కేసు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన చుట్టూ మరింతగా సమస్యలు అధికం అవుతున్నట్టు కన్పిస్తోంది. అశ్లీల చిత్రాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా ఈ వ్యాపారవేత్తకు సంబంధించి తన స్టేట్మెంట్ ను ఇచ్చింది. యాప్ కోసం బోల్డ్ కంటెంట్‌ను సృష్టించే రాజ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మ్‌స్ప్రైమ్ స్పష్టం చేసింది. దీనితో పాటు రాజ్ ఈ కంపెనీ నుండి 2019 సంవత్సరంలో రిజైన్ ఇచ్చాడని కూడా వెల్లడించారు. ఆర్మ్‌స్ప్రైమ్ స్టేట్మెంట్ ప్రకారం మిస్టర్ కుంద్రా డిసెంబర్ 2019 లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆర్మ్స్ మీడియాతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. హాట్ షాట్ యాప్ కోసం రాజ్ కుంద్రా సృష్టించిన కంటెంట్‌తో ప్రస్తుతం కేసులో సాక్షిగా ఉన్న ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా డైరెక్టర్ సౌరభ్ కుష్వాహాకు కూడా దీనితో ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. టెక్ కంపెనీగా ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా యాప్ టెక్నికల్ అసిస్టెంట్‌ చేయడానికి మాత్రమే సహాయపడింది. శ్రీ కుష్వాహా ప్రాపర్టీ సెల్, క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీసులతో పూర్తిగా సహకరించారు. పోలిసుల దర్యాప్తుకు అవసరమైన అన్ని డాక్యూమెంట్స్ ను వారికి అందించారు.
హాట్‌షాట్ యాప్‌ను ఆర్మ్‌స్ప్రైమ్ లిమిటెడ్ ఏర్పాటు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇందులో రాజ్‌కుంద్ర, సౌరభ్ కుశ్వాహా డైరెక్టర్లుగా ఉన్నారు. ఆగష్టు 2015 నుండి డిసెంబర్ 2020 వరకు హాట్‌షాట్ యాప్ నుండి వచ్చిన ఆదాయాన్ని ఆర్మ్‌స్ప్రైమ్ ఇండియాకు ఖాతాకు బదులుగా యూకే లో ఉన్న లాయిడ్స్ బ్యాంక్‌ ఖాతాకు గూగుల్, యాపిల్ యాప్ ల ద్వారా పంపించారనే విషయం ఇటీవలే బయటకు వచ్చింది. హాట్‌షాట్ ను 2019లో యూకే కు సంబంధించిన వ్యక్తులకు అమ్మేశారు. దానికి ముందు రోజే రాజ్ ఆర్మ్‌స్ప్రైమ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.
రాజ్ ఇటీవల తన బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. బుధవారం ముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు సంబంధించి 1500 పేజీల ఛార్జిషీట్ ను ముంబై సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. దీని కారణంగా రాజ్ తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం రాజ్ తన కొత్త బెయిల్ దరఖాస్తును త్వరలో ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక శిల్పాశెట్టి నేను నా పనిలో బిజీగా ఉన్నాను. రాజ్ ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. ఈ విషయంలో తనకు ఎలాంటి అవగాహన లేదని శిల్పా చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: