తన మధుర గానంతో ప్రేక్షకులను మైమరపించిన మాళవిక..!

Divya
గత కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది గాయనీ గాయకులు తమ మధురమైన స్వరంతో పాటలు పాడి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే 2000 దశకంలో ప్రేక్షకులను తన పాటలతో మెస్మరైజ్ చేసిన మాళవిక గురించి ఒకసారి తెలుసుకుందాం..
మాళవిక విశాఖపట్నం లో జన్మించింది. ఇక చిన్న వయసులో ఉన్నప్పుడే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకుంది.. నిజానికి తన తల్లి కూడా ఒక సంగీత ఉపాధ్యాయురాలు.. ఈమె విశాఖపట్నంలో ఉన్న లిటిల్ ఎంజల్స్ హై స్కూల్ లో సంగీత ఉపాధ్యాయురాలిగా పని చేసేది. మాళవిక కూడా తన తల్లి దగ్గర సంగీతాన్ని నేర్చుకుని , ఆ తర్వాత శాస్త్రీయసంగీతంలో కుమారి మందపాక శారద దగ్గర పూర్తి శిక్షణ పొందింది. తన విద్యాభ్యాసాన్ని విశాఖపట్నం లో ఉన్న లిటిల్ ఎంజల్స్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మాళవిక , ఆ తర్వాత చుట్టుపక్కల జరిగే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని మరెన్నో బహుమతులను సొంతం చేసుకుంది..

మాళవిక మొదటిసారి 2003లో చార్మినార్ సినిమాలో గోదావరి లా  అనే పాట పాడి విశేష జనాదరణ పొందింది.. ఆ తర్వాత 2003 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన గంగోత్రి సినిమాలో కూడా పాట పాడి పైలెట్ గా నిలిచింది.. ఇక తర్వాత మిస్టర్ ఎర్రబాబు ,శ్రీరామదాసు, ఏక్ నిరంజన్,  బిల్లా, ధీర, ఒరిజినల్ , నచ్చావ్ అల్లుడు, ఎవరైనా ఎప్పుడైనా, సింహం లాంటి ఎన్నో చిత్రాలలో తనదైన శైలిలో తన స్వరాన్ని ప్రేక్షకులకు వినిపించింది.. ఇక అంతే కాదు ఝుమ్మందినాదం,వరుడు, రాజన్న, ఓ మనసా, ప్రేమకథాచిత్రం వంటి చిత్రాలలో ఎన్నో మధుర పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఈమె గొంతు వినడానికి వినసొంపుగా చాలా అద్భుతంగా ఉంటుంది.. ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్న  మాళవిక పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి షోలలో కూడా తన గానంతో అందరినీ మైమరిపించింది. 2013 ఫిబ్రవరి 15వ తేదీన ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం అనే గ్రామానికి చెందిన కృష్ణచైతన్య ను వివాహం చేసుకుంది.. ఇతను కూడా మ్యూజిక్ లవర్ అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: