ఎన్టీఆర్ తో పాటు పవన్ కోసం కూడా .... ??

GVK Writings
తమిళ యువ దర్శకుడు అట్లీ మన తెలుగు ప్రేక్షకులకు కొంత సుపరిచితం అనే చెప్పాలి. ఆయన తీసిన రాజా రాణి సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో పాటు ఆపైన ఇళయాళతళపతి విజయ్ తో తీసిన తేరి ,మెర్సల్, బిగిల్ వంటి సినిమాలు తెలుగు లో కూడా రిలీజ్ అయి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. మంచి మెసేజ్ తో పాటు భారీ యాక్షన్ కమర్షియల్ హంగులతో సినిమాలు తీసే అలవాటున్న అట్లీ మన తెలుగు హీరోలతో కూడా చేయాలని ఉందని పలు ఇంటర్వ్యూ ల్లో వెల్లడించారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని, తన ప్రతి సినిమాని ఎన్టీఆర్ ప్రత్యేకంగా వీక్షించి కాల్ చేసి విషెస్ చెప్తుంటారని అన్నారు అట్లీ. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ తో భారీ మూవీ చేస్తున్నారు అట్లీ. ఇటీవల కొన్నాళ్లుగా ఎన్టీఆర్ కాంబో మూవీ విషయమై కథా చర్చలు జరుగుతుండగా కొన్నాళ్ల క్రితం ఆ మూవీ స్టోరీ ఓకే అయిందని, త్వరలో అట్లీ ఈ మూవీ స్క్రిప్ట్ ని ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం షారుక్ తో చేస్తోన్న మూవీ అనంతరం ఎన్టీఆర్ తో మూవీని ప్రారంభించనున్నారట అట్లీ. ఇక మరోవైఫు ప్రస్తుతం ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్, దాని తరువాత కొరటాల శివతో మరొక భారీ మూవీ కూడా చేయనున్న విషయం తెలిసిందే.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు మూవీస్ తరువాత అట్లీ తో మూవీ ఉండనుందట. ఇక అసలు విషయం ఏమిటంటే అట్లీ కేవలం ఎన్టీఆర్ కోసమే కాదు, అటు పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని, పవన్ ఇమేజ్ కి సరిపోయే కథని త్వరలో ఆయనకు వినిపించిన అనంతరం ఫుల్ డీటెయిల్స్ అట్లీ మీడియాకి వెల్లడించనున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. మరి ఇదే కనుక నిజం అయితే అటు ఎన్టీఆర్ తో పాటు, ఇటు పవన్ సినిమాల ఛాన్స్ లు కూడా అట్లీ పట్టేసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: