కొత్త సినిమా కి సైన్ చేసిన సమంత..హీరో ఎవరంటే !!

P.Nishanth Kumar
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే. నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో కనిపించడం బొత్తి గా మానేసింది. అభిమానుల కోరిక మేరకు ఆమె శాకుంతలం అనే లేడీ ఓరియంటెద్ సినిమాలో నటించగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోగా దీని తర్వాత ఆమె ఏ సినిమాలో నటిస్తోంది అన్న  డైలమాలో అభిమానులను పడేసింది.పౌరాణిక సినిమాలో నటిస్తున్న ఈమే ఈసారి మంచి కమర్షియల్ సినిమాలో నటించాలని భావిస్తుంది. 

ఓ వైపు ఆమె నాగ చైతన్య తో విభేదాలు వస్తున్నాయని త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని వార్తలు కాగా వాటిపై అరకొరగా స్పందిస్తూ ఉండడం అభిమానును ఇంకాస్త అయోమయానికి గురి చేస్తుంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఆమె తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా వారికీ సంతోషం కలిగించే వార్త ఇప్పుడు బయటకు రాబోతుంది. అక్కినేని సమంత తన తదుపరి సినిమాకి సైన్ చేసిందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.  

శాకుంతలం తరువాత మరొక వెరైటీ లేడి ఓరియెంటెడ్ సినిమాలో ఈమె నటించబోతుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.మంచి కథ తో వెరైటీ దర్శకుడు ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు.  మరోవైపు ఈమె కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ గ నటించే సినిమా కోసం ఎదురు చూస్తోందట. త్వరలోనే ఓ పెద్ద దర్శకుడి సినిమా లో హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది. అందులో స్టార్ హీరో నటిస్తుండటం విశేషం. ఏదేమైనా సమంత మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా కనిపిస్తూ ఉండడం అందులో ఎంతో సంతోషాన్ని కలుగ చేస్తుంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: