లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా సర్ప్రైజ్ .... ??

GVK Writings
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తో తొలిసారిగా శేఖర్ కమ్ముల తీసిన లవ్ కం ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లవ్ స్టోరీ. హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థల పై నిర్మితం అయిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కూడా మధ్యతరగతికి చెందిన యువతీ యువకులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఈ మూవీ పాటల తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కి కూడా అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది.
తన మార్క్ స్టైల్ ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా, నాగ చైతన్య ఇమేజ్ కి తగ్గట్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పవన్ సంగీతం అందించిన ఈ సినిమా పై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మ్యాటర్ లోకి వెళితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19న జరగనుండగా ఈ వేడుకకి అక్కినేని నాగార్జున తో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్.
నాగ్ తో చిరు కు మంచి అనుబంధం ఉండడంతో ఆయన అడిగిన వెంటనే చిరంజీవి రావడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే మరొక రెండు రోజుల్లో జరుగనున్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా, అక్కినేని ఫ్యాన్స్ తో సందడి చేయడం ఖాయం. మరోవైపు మూవీని ఎంతో భారీ రేంజ్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. మరి ఫస్ట్ టైం శేఖర్ తో కలిసి నాగ చైతన్య చేసిన ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: