మళ్ళీ ఎన్టీయార్ బోయపాటి కాంబో ... ?

Satya
జూనియర్ ఎన్టీయార్ పక్కా మాస్ హీరోగా మారాక మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆయనతో దమ్ము సినిమా తీశాడు. ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద చాలా కాలం తరువాత ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు తీశారు. అయితే ఈ మూవీలో యాక్షన్ పార్ట్ ఎక్కువై కధ తక్కువై అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది.
ఈ మూవీ పదేళ్ళ క్రితం రిలీజ్ అయింది. ఇక ఈ మూవీలో కాస్టింగ్ కూడా అనుకున్నట్లుగా లేదని అంతా భావించారు. మొత్తానికి ఎన్నో కారణాలు కలసి దమ్ము మూవీ బ్యాడ్ రిజల్ట్ ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత మళ్లీ జూనియర్ తో బోయపాటి మూవీ ప్లాన్ అన్నది జరగలేదు. ఇక బాలక్రిష్ణతో మాత్రం సింహ, ఆ తరువాత లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను  బోయపాటి ఇచ్చారు. ఇపుడు అఖండ మూవీతో హ్యాట్రిక్ విక్టరీని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అఖండ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ హిట్ అయితే మాత్రం బోయపాటి దశ తిరిగినట్లే అని కూడా చెబుతున్నారు. ఈ మూవీ రిజల్ట్ ని బట్టి అల్లు అర్జున్ తో మరో సారి బోయపాటి జత కట్టే చాన్స్ ఉందిట. అలాగే బోయపాటి జూనియర్ ఎన్టీయార్ మూవీ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి ఎన్టీయార్ కి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందించి తీరుతాను అని బోయపాటి పట్టుబట్టి కూర్చున్నారు.
ఇప్పటికైతే జూనియర్ ఎన్టీయార్ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి అఖండ హిట్ అయినా కూడా ఈ ఇద్దరు కాంబోలో మూవీ రావాలంటే కచ్చితంగా 2024 వరకూ ఆగాల్సిందే అంటున్నారు. ఏది ఏమైనా నందమూరి వంశానికి అచ్చిన మాసిజంతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా తీయగలిగే బోయపాటి జూనియర్ కి కూడా బాక్సాఫీస్ బద్ధలు అయ్యే హిట్ ఇస్తే మాత్రం ఆ కధే వేరుగా ఉంటుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: