స్టార్ హీరోయిన్ బయోపిక్.. ఎవరు ముందుకు వస్తారో..?

Anilkumar
ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లు ఎక్కువగా కమర్షియల్ సినిమాలలో నటిస్తూ.. భారీ రెమ్యునరేషన్స్ ని అందుకుంటున్నారు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తే సంపాదన ఎక్కువ ఉంటుందేమో కానీ.. ఇండ్రస్టీ లో ఫేమ్ రావాలంటే మాత్రం కచ్చితంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలి.ఇక మంచి ఫేమ్ తో పాటూ డబ్బు రెండు రావాలంటే మాత్రం బయోపిక్స్ లో నటించాల్సిందే.ఒక్కోసారి అలాంటి పాత్రలే లైఫ్ లాంగ్ అందరకీ గుర్తుండిపోతాయి.అందుకే మన అగ్ర హీరోయిన్లు సైతం బయోపిక్స్ లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.ఇక ఇదే విషయాన్ని  రష్మీక ని అడిగితే..ఆమె ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.కథానాయికలకు వ్యక్తిగతంగా కొన్ని కలల పాత్రలు ఉంటాయి.

వాటికోసం ఎన్నాళ్ళైనా వేచి చూస్తారు.
ఆ అవకాశం కనుక వస్తే ఎన్ని త్యాగాలు చేసైనా సరే ఓకే చేసేస్తారు.అలా రష్మీకకు కూడా కొన్ని కలల పాత్రలు ఉన్నాయట.వాటిలో ఒకటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ సౌందర్య గారిలా నటించడం.ఎందుకంటే రష్మీకకు ఇష్టమైన నాయికల్లో సౌందర్య కూడా ఒకరు.రష్మీకను చిన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు సౌందర్య లాగా ఉన్నావని అనేవారట.అందుకే ఆమె పాత్రలో నటించాలని ఉందని చెప్పింది రష్మీక.ప్రస్తుతం చూసుకున్నట్లైతే టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ అంతగా లేదు.కీర్తీ సురేష్ నటించిన 'మహానటి' తర్వాత వరుసగా అలాంటి బయోపిక్ లు వస్తాయని అనుకున్నా..ఆ తర్వాత ఎవరూ బయోపిక్ లు తెరకెక్కించాడనికి పెద్దగా డేర్ చేయలేదు.

ఇక అటు సౌత్ లో చూసుకున్నా అదే పరిస్థితి ఉంది.ఇలాంటి సమయంలో సౌందర్య బయోపిక్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.ఇక రష్మీక అన్నట్లు  ఎవరైనా ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. అయితే గతంలో కూడా చాలా మంది దర్శకులు సౌందర్య గారి బయోపిక్ ని తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇప్పటి వరకు అది సఫలం అవ్వలేదు.ఒకవేళ ఇప్పుడైనా దర్శకుడు సిద్ధంగా ఉంటే సౌందర్య బయోపిక్ లో నటించడానికి రష్మీక రెడీగా ఉంది.మరి సౌందర్య బయోపిక్ కోసం ఏ దర్శకుడు ముందుకు వస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: