NTR 30 : ఆరు నెలల్లో సాధ్యమేనా తారక్..?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినా.. ఇంకా రిలీజ్ పై మేకర్స్ కచ్చితంగా ఏం చెప్పలేకపోతున్నారు. అయితే ఈ సినిమా అనంతరం కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమాకి కమిటయ్యాడు తారక్.ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతుంది.అయితే తాజా సమాచారం అందుకున్న ఈ ప్రాజెక్ట్ మరో రెండు వారాల తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ని సైతం ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్  29 న కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబో మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు.

అయితే ఆ తేదీకి సినిమాను విడుదల చేయడం అనేది సాధ్యమేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఎన్టీఆర్ కొరటాల సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో కేవలం ఏడు నెలల్లో  షూటింగ్ ని పూర్తి చేసి.. సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాదు.అయితే ఇతర భాషా నటీ నటులు కూడా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తుండటంతో ఆయా భాషల నటీ నటుల డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏకంగా మూడు సార్లు వాయిదా పడటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో వున్నారు.ఇక మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ సినిమా విషయంలో అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అటు మరోవైపు కొరటాల శివ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లకు దూరంగా ఉండటంతో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఆయన ఫ్యాన్స్ కి తెలియడం లేదు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల శివ స్పీడ్ పెంచాలని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' సినిమా పనులతో బిజీగా వున్నాడు.ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు కొరటాల శివ.ఇక సినిమాలో ఎన్టీఆర్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని ఎంపిక చేసినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: