రానా ఎందుకు ఆలోచనలో పడ్డాడు!!

P.Nishanth Kumar


పాన్ ఇండియా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దగ్గుబాటి రానా. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకున్న  రానా ఇప్పుడు సోలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఆయన సూపర్ హిట్ సాధించగా ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫిస్ వద్ద సూపర్ హిట్ కాలేకపోయాయి. దాంతో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి లో ఉన్నాడు రానా.

ఎన్నో ఆశలతో పాన్ ఇండియా సినిమా చేసిన అరణ్య ప్రేక్షకులలో భారీ నిరాశలో ఉంచడం తో ఒక్కసారిగా డల్ అయిపోయాడు.  ఇప్పుడు విరాటపర్వం సినిమాతో తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా లోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో అనేది ఇప్పటివరకు చెప్పకుండా చిత్రనిర్మాతలు సంశయంలో ఉండడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

అవుట్ పుట్ విషయంలో తేడాగా ఉండటంతో ఈ సినిమా హోల్డ్ లో ఉందని అందుకే థియేటర్లలో విడుదల చేయాలా లేదా ఓ టీ టీ లో విడుదల చేయాలా అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. రానా కూడా ఈ చిత్రం గురించి ఏమీ చెప్పలేక పోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ఏ విధంగా విడుదల చేయాలనే అయోమయంలో ఆయన ఉన్నాడట. మరోవైపు భీమ్లా నాయక్ సినిమా లో విలన్ గా నటిస్తున్న రానా ఆ చిత్రం షూటింగ్ ఎంతో హుషారుగా పాల్గొంటున్నాడు. అంతేకాదు తన తదుపరి చిత్రాల విషయంలో కూడా ఎంతో హుషారుగా పాల్గొంటున్నాడట. మంచి మంచి కథలు ఎంపిక చేసుకునే విధంగా ఆయన ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో విరాటపర్వం సినిమా విషయంలో ఈ చిత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: