నాగ్ కి ఈ వయసులో ఎంత కష్టం!!

P.Nishanth Kumar


అక్కినేని నాగార్జున వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో మరోవైపు ప్రవీణ్ సత్తారు కళ్యాణ్ కృష్ణ ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు. ఇలా వరుస సినిమాలతో ఆయన తన కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఆయన తన కొడుకుల కెరీర్ ను సెట్ చేసే విధంగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి చాలా సినిమాలు చేసినా ఈ అక్కినేని వారసులు మాత్రం మీడియం రేంజ్ హీరోలుగా కూడా నిలదొక్కుకోలేక పోతున్నారు.

అక్కినేని నాగచైతన్య ఓకే అనుకున్న కూడా అక్కినేని అఖిల్ మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోతున్నాడు. గత మూడు సినిమాలు గా నిరాశ పరుస్తూ వచ్చిన అఖిల్ ఇప్పుడు ఆయన హీరోగా చేయబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఈ చిత్రం తో అయినా ప్రేక్షకులను మెప్పిస్తాడా అనేది చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది గీతా ఆర్ట్స్ సంస్థ. 

 ఇక అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రం లవ్ స్టొరీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించే విధంగా సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా అక్కినేని నాగచైతన్యకు చాలా రోజుల తర్వాత హిట్ సినిమాగా ఇది ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా తన సినిమాలు తన షూటింగ్ లు చేసుకుంటూ కొడుకు సినిమాలను సెట్ చేసే విధంగా నాగార్జున ఎంతో కష్టపడుతున్నాడు.  వయసు మీద పడుతున్నా కూడా ఆయన ఏమాత్రం అలసించకుండా 24 గంటల పని చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: