బాలకృష్ణ కాదు.. వెంకటేష్.. సర్ప్రైజ్ అదిరింది!!

P.Nishanth Kumar


దసరా కానుకగా టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అక్టోబర్ నెలలో దసరా పండగ ఉన్న నేపథ్యంలో పండుగ కంటే ముందు ఉన్న రెండు వారాలలో దాదాపు పదికి పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అక్టోబర్ 1వ తేదీన సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పబ్లిక్ సినిమా విడుదల కాబోతుండగా అక్టోబర్ 8వ తేదీన వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం మరియు అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమాలు విడుదల కానున్నాయి.

ఈ రెండు చిత్రాలు టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిని కలిగించే క్రేజ్ ఉన్న సినిమాలు కాగా ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక అక్టోబర్ 15 వ తేదీన మహా సముద్రం అలాగే పెళ్లి సందడి ఇ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ విధంగా మూడు వారాలుగా సినిమా థియేటర్లలో ఎంతో సందడి నెలకొననుంది. ఇలా పది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఆచార్య మరియు అఖండ సినిమాలు మాత్రం విడుదల కావడం లేదని తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య పూర్తయి చాలా రోజులు అయింది. ఈ సినిమా దసరా కి వస్తుందని అందరూ భావించగా ఇప్పుడు దసరా సీజన్ కు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇటు మరొక సీనియర్ హీరో బాలకృష్ణ అఖండ సినిమా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. మరొక పది రోజులలో ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. మొదటి నుంచి ఈ చిత్రం దసరా కి  విడుదల అవుతుంది అని వార్తలు రాగా అయితే అది  జరుగుతుందా లేదా అనే విషయం ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ కాదని వెంకటేష్ తన దృశ్యం2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. మరి అనుకోకుండా వెంకటేష్ ఇస్తున్న ఈ సర్ప్రైజ్ ను ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: