మేజిషన్ గా మారబోతున్న రామ్ చరణ్ ??

NIKHIL VINAY
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాకుండా యాడ్స్ రూపంలో కూడా కొన్ని కోట్లు గడిస్తున్నాడు. ఆయన ఒక్క యాడ్ కి కోటి రూపాయలు కూడా తీసుకుంటాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కి వరసగా సినిమాలు ఉన్నాయి. ఒక పక్క రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి ప్యాచ్ వర్క్ ని పూర్తి చేస్తూ ఇంకోపక్క శంకర్ సినిమా షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న రామ్ చరణ్ ఈ మద్యనే డిస్నీ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.

అయితే హాట్ స్టార్ రామ్ చరణ్ తో క్రేజీ యాడ్ ఒకటి ప్లాన్ చేసింది.ఈ యాడ్ లో రామ్ చరణ్ ఒక మేజిషన్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఈ మద్యనే డిస్నీ హాట్ స్టార్ ఓటిటి తన ధరలని అందరికి అందుబాటులో ఉండేలా తగ్గించింది. దీనిని ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ ఈ యాడ్ ని చేస్తున్నాడు. ఈ యాడ్ పూర్తి అయిన వెంటనే ఆయన శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ సినిమా పూజ ఈమధ్యనే ఘనంగా మొదలైంది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కి కూడా మంచి పాత్రని ఇచ్చారు శంకర్. ఈ సినిమా ఇండియాలోని ప్రధాన భాషలు అన్నింటిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ని శంకర్ కార్పోరేట్ వ్యవస్థ మీద తీయబోతున్నారు. రామ్ చరణ్ ఇందులో ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటిదకా ఒక్క సినిమా కూడా రాలేదు అని టాక్. ఈ సినిమా కానీ హిట్ అయితే రామ్ చరణ్ నేషనల్ స్టార్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: