మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్..!

Divya
మెగాస్టార్ నటించబోతున్న కొన్ని సినిమాలలో ఇప్పటికే పలువురు స్టార్ నటులు నటించబోతున్నారు..అనే వార్తలు, రోజురోజుకు సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.. ఇకపోతే ఇటీవల మరో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా చిరంజీవి నటించబోతున్న సినిమాలో నటిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. సాధారణంగా ఒకసారి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం కానీ.. అలనాటి తార రమ్యకృష్ణ హీరోయిన్ గా ఎలా అవకాశాలను అందిపుచ్చుకున్నదో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అంతే స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన, బాహుబలి, బాహుబలి 2  వంటి సినిమాలతో తనలో ఉన్న నటనా, ప్రతిభ ఎక్కడికీ పోలేదని నిరూపించుకొని తిరిగి.. లైగర్, రంగమార్తాండ, బంగార్రాజు, రిపబ్లిక్ సినిమా లో బిజీగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రమ్యకృష్ణ తీసుకొని పారితోషకం ఎక్కువే అని తెలిసినప్పటికీ, ఈమెకు భారీ స్థాయిలో సినిమాలలో అవకాశాలు అందుతున్నాయి. ఈమె నటనను మెచ్చి దర్శక నిర్మాతలు కూడా ఈమె కోసం క్యూ కడుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లో, రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అప్పట్లో చిరంజీవి, రమ్యకృష్ణ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి అని తెలుసు.  చిరంజీవికి మొదట చెల్లి గా నటించిన రమ్య కృష్ణ, ఆ తర్వాత ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు , అల్లుడా మజాక సినిమాలలో చిరంజీవి సరసన నటించింది.. అంజి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది.

దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.. దాంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో చక్కగా ప్లాన్ చేసుకుంటోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: