దసరా కు అదిరిపోయే అప్డేట్ ఇస్తానంటున్న నాని..!

Pulgam Srinivas
ఇప్పటికే దేశంలో కరోనా వల్ల పెద్ద హీరోలు థియేటర్లలో సినిమాలను విడుదల చేయలేక సైలెంట్ గా ఉంటే, నాచురల్ స్టార్ నాని మాత్రం 'ఓటిటి'  ద్వారా తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'వి' సినిమాను ప్రముఖ 'ఓటిటి' అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ మద్యే నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'టక్ జగదీష్' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశాడు. ఇలా రెండు సినిమాలను 'ఓటిటి' లో విడుదల చేసిన నాని. ప్రస్తుతం నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలలో శ్యామ్ సింగరాయ్ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తవడంతో కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ సుకుమార్ కు చాలా బాగా నచ్చడంతో నానికి వినిపించినట్లు నాని కి కూడా ఈ కథ చాలా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ దసరాకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాకు కూడా దసరా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నాచురల్ స్టార్ నాని తో ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తీయాలని దర్శకుడు శ్రీకాంత్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం నటిస్తున్న 'అంటే సుందరానికి' సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: