పుకార్లకు చెక్ పెట్టిన సమంత !

Seetha Sailaja
సమంత నాగచైతన్య ల మధ్య ఎదో జరుగుతోంది అంటూ గత కొన్నిరోజులుగా మీడియాలో అనేక గాసిప్పుల హడావిడి జరుగుతోంది. ఈ గాసిప్పుల గురించి సమంత నాగచైతన్య లు స్పందించకుండా మౌనం వహించడంతో ఈ గాసిప్పుల హడావిడి మరింత పెరిగిపోయింది. ఈవార్తల హడావిడి మధ్య సమంత గోవా వెళ్ళిపోయింది ఇప్పట్లో హైదరాబాద్ రాదు అంటూ వార్తలు కూడ వచ్చాయి.

అయితే అందరి ఊహలకు షాక్ ఇస్తూ సమంత ఒక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉంటాను అంటూ ఆమధ్య తెలిపిన సమంత తన నిర్ణయాన్ని మార్చుకుని ‘ఆదిత్యా 369’ ‘వంశానికి ఒక్కడు’ ‘జెంటిల్మెన్’ ‘సమ్మోహనం’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి.

ఈసినిమాకు ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడట. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోరాని ఒక సంచలన కథ కావడంతో ఆ కథ నచ్చి సమంత ఈమూవీలో చేయడానికి ఒప్పుకుంది అని అంటున్నారు. ఈ సినిమా టైటిల్ కూడ చాల డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు అనేకమంది పనిచేయబోతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అంటున్నారు.

ఒకేఒక లాంగ్ షెడ్యూల్ తో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయడానికి సమంత ఈ మూవీ దర్శక నిర్మాతలకు బల్క్ డేట్స్ ఇచ్చింది అని అంటున్నారు. ఈ వార్తలను చూస్తుంటే సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ వచ్చిన వార్తలు యదార్థం కాదు అని అనిపిస్తోంది. ఇప్పటికే లవ్ స్టోరీలు కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ కథల పై కన్నేసిన సమంత మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అమెజాన్ ప్రైమ్ కోసం ఒక ఓటీటీ వెబ్ సిరీస్ ను క్లియర్ చేసిన సమంత వేగం ఇప్పట్లో ఆగదు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: