బయటపడిన రాజ్ కుంద్రా డబ్బు లావాదేవీలు

Vimalatha
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అసభ్యకరమైన సినిమాలు తీసి, యాప్‌లో ప్రదర్శించినందుకు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోపణల కారణంగా గత కొంతకాలంగా జైలులో ఉన్నారు. తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పుడు 1500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ కేసులో కొత్త సమాచారం బయటకు వస్తోంది. ఇదంతా చూస్తుంటే రాజ్ సమస్యలు మరింతగా పెరిగేలా కన్పిస్తున్నాయి. హాట్‌షాట్ యాప్‌ను ఆర్మ్‌స్ప్రైమ్ లిమిటెడ్ స్థాపించింది, ఇందులో రాజ్‌కుంద్ర, సౌరభ్ కుశ్వాహా డైరెక్టర్లుగా ఉన్నారు. నివేదిక ప్రకారం కుశ్వాహా 35% వాటాను కలిగి ఉండగా, వీడియోల అప్‌లోడింగ్‌తో సహా యాప్ నియంత్రణ రాజ్ కుంద్రా చేతిలో ఉందని తెలుస్తోంది. హాట్‌షాట్ యూకేకి చెందిన కెన్రిన్ లిమిటెడ్‌కు అమ్మేశారు. ఆ అమ్మకానికి ఒక రోజు ముందు రాజ్‌కుంద్రా ఆర్మ్‌స్ప్రైమ్ డైరెక్టర్‌గా వైదొలిగారు. కాగా రాజ్ భార్య, నటి శిల్పా శెట్టిని ఛార్జిషీట్‌లో 39 వ సాక్షిగా చేర్చారు. అందులో శిల్పా తాను బిజీగా ఉన్నానని, తన పని గురించి తన భర్తను అడగలేదని చెప్పింది.
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా 2015 లో యానిమేషన్‌లు, కార్టూన్‌లు, యాప్‌లను రూపొందించే వయాన్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో క్రైమ్ బ్రాంచ్ కేసును ఛేదించి రాజ్ పిఎ ఉమేశ్ కామత్‌ను అరెస్టు చేసినప్పుడు శిల్పా తన భర్తను దాని గురించి ప్రశ్నించింది. గెహన వశిష్ఠ స్వతంత్రంగా అశ్లీల చిత్రాలను చిత్రీకరించి అప్‌లోడ్ చేసినట్లు రాజ్ తనకు చెప్పినట్లు శిల్పా చెప్పారు. ఇది మాత్రమే కాదు ఆర్మ్‌స్ప్రైమ్ విక్రయానికి ముందు కూడా యూకే లోని లాయిడ్స్ బ్యాంక్‌లోని కెన్రిన్ ఖాతాలో గూగుల్, యాపిల్ యాప్‌ల ద్వారా డబ్బు మార్పిడి జరిగినట్లు పోలీసు ఛార్జిషీట్‌లో వెల్లడించారు. ఆగష్టు 2015 నుండి డిసెంబర్ 2020 వరకు హాట్‌షాట్ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని గూగుల్, యాపిల్ ద్వారా ఆర్మ్‌స్ప్రైమ్ ఇండియన్ ఖాతాకు బదులుగా యూకే లోని లాయిడ్స్ బ్యాంక్‌లో నిర్వహించే కెన్రిన్ బ్యాంక్ ఖాతాకు పంపారు. హాట్‌షాట్ 2019లో అమ్మేశాడు రాజ్. కానీ అమ్మకానికి ఒక రోజు ముందు కుంద్రా ఆర్మ్స్‌ప్రైమ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: