యాక్షన్ హీరో గోపీచంద్ తండ్రి ఎవరో తెలుసా?

P.Nishanth Kumar
యాక్షన్ హీరోగా మాస్ హీరోగా ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలతో అలరిస్తూ వచ్చిన గోపీచంద్ ఇటీవల సిటీమార్ చిత్రం తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడమే కాకుండా గోపీచంద్ స్టామినా ను కూడా టాలీవుడ్ కి తెలియజేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించగా ఈ సినిమా గోపీచంద్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దర్శకుడు టి కృష్ణ సినిమా వారసుడిగా సినిమా పరిశ్రమలోకి ప్రతినాయకుడిగా పరిచయమై ఆ తర్వాత హీరోగా తనను తాను పరీక్షించుకున్నాడు.  విలన్ గా చేసిన హీరోగా చేసిన ఒకే రకమైన క్రేజ్ తో ఆయన కెరీర్ ముందుకు సాగింది అని చెప్పవచ్చు. తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత వర్షం జయం నిజం వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆ సినిమాలు ఆయనకు గొప్ప పేరును తెచ్చిపెట్టడమే కాకుండా హీరోగా చేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఆ క్రమంలోనే ఆయన యజ్ఞం రణం లక్ష్యం వంటి చిత్రాల్లో నటించి హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు.
ఆ సినిమాలు హిట్ అయిన తరువాత ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది గోపీచందు కు. ఆ తర్వాత వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. అయితే సూపర్ హిట్ సినిమాలను చేయడంలో కొంత వెనకబడ్డాడు గోపీచంద్. కథల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఫ్లాప్ లను అందుకున్నాడు కానీ ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్లు అయింది. ఏదేమైనా ఫ్లాపులు వచ్చినా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పెంచుకుంటూ ఇప్పుడు ఇంత దూరం వచ్చాడు.ప్రస్తుతం గోపిచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత తనకు లక్ష్యం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరి భవిష్యత్తులో ఈ హీరో ఇంకా ఇలాంటి సంచలనాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: